AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. అద్దె గదుల కోసం శ్రీవారి భక్తుల అవస్థలు

Tirumala: కరోనా వైరస్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారు కొలువైన ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతిలో కరోనా నిబంధనలను టీటీడీ అధికారులు కఠినంగా అమలు..

Tirumala: తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. అద్దె గదుల కోసం శ్రీవారి భక్తుల అవస్థలు
Tirumala
Surya Kala
|

Updated on: Dec 08, 2021 | 3:54 PM

Share

Tirumala: కరోనా వైరస్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారు కొలువైన ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతిలో కరోనా నిబంధనలను టీటీడీ అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులు తిరుమల కొండపైకి చేరుకోవడానికి ముందే దర్శనం, వసతి ఏర్పాట్లు చేసుకునే విధంగా ఆన్ లైన్ విధానం తీసుకొచ్చారు. అయితే తాజాగా కోనేటిరాయుడు దర్శనానికి వెళ్లిన శ్రీవారి భక్తులు తిరుమల  కొండపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె గదుల కోసం నానావస్థలు పడుతున్నారు. దీనికి కారణం తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళలన చేయడం అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

తిరుమలలో మలయప్పస్వామికి దర్శించుకోవడానికి వెళ్లిన స్వామివారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు  ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సర్వీసెస్‌ కింద పని చేస్తున్నారు.  ఈ కార్మికులు తమను టీటీడీ కార్పొరేషన్‌లో కలపాలంటూ  గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు తమ విధులను సైతం బహిష్కరించారు. దీంతో తిరుమలలో పారిశుద్ధ్య పనులకు ఆటంకం ఏర్పడింది. భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తిరుమలలో అద్దె గదులను కేటాయించడంతో టీడీపీ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము ఉదయం 6 గంటల నుంచి గదుల కోసం వేచి ఉన్నామని.. ఇప్పటికీ గదులు కేటాయించలేదంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై అధికారులను అడిగితె సరైన సమాధానం చెప్పడం లేదంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు కరోనా మరో వైపు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో.. తమ భద్రతపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  ఏపీలోని పల్లె వెలుగు బస్సులకు సరికొత్త అందాలు.. రంగులు మార్చుకుంటున్న వైనం..

ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్
ప్రతి ఆదివారం చికెన్ ఎక్కువ తినేస్తున్నారా..?
ప్రతి ఆదివారం చికెన్ ఎక్కువ తినేస్తున్నారా..?
ఆ టాలీవుడ్ హీరోకి మరణగండం! ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు!
ఆ టాలీవుడ్ హీరోకి మరణగండం! ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు!
మీ ముఖం చందమామలా మెరిపోవాలంటే.. చందనంతో ఈ హోం రెమెడీ ట్రై చేయండి
మీ ముఖం చందమామలా మెరిపోవాలంటే.. చందనంతో ఈ హోం రెమెడీ ట్రై చేయండి