Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

French Open 2021: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌.. సెమీస్‎లోకి దూసుకెళ్లిన పీవీ సింధు..

స్టార్ షెట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్‌లో శుక్రవారం థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి సెమీస్‎కు దూసుకెళ్లింది...

French Open 2021: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌.. సెమీస్‎లోకి దూసుకెళ్లిన పీవీ సింధు..
Sindhu
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 30, 2021 | 9:02 AM

స్టార్ షెట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్‌లో శుక్రవారం థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి సెమీస్‎కు దూసుకెళ్లింది. మూడో సీడ్‌గా ఉన్న సింధు 38 నిమిషాల్లో ఎనిమిదో సీడ్‌పై 21-14 21-14 తేడాతో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో సయాకా తకహాషి (జపాన్‌)తో సింధు తలపడనుంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సింధు గురువారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో 21-19, 21-9తో ప్రపంచ 24వ ర్యాంక్‌లో ఉన్న డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫర్‌సన్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. సింధు, బుసానన్‌ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. విరామం తర్వాత సింధు మరోసారి 16-10, 20-12లో నిలిచింది. పీవీ సింధు తొలి రౌండ్‎లో టర్కీకి చెందిన నెస్లిహాన్‎పై విజయం సాధించింది.

యువ కెరటం లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో కొరియాకు చెందిన హియో క్వాంగీ చేతిలో 43 నిమిషాల్లో 17-21 15-21 తేడాతో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడి 21–18, 18–21, 17–21తో ఆరోన్‌ చియా–సో వుయ్‎యికి (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది.

Read Also..  T20 World Cup 2021: న్యూజిలాండ్‎తో ఆడే జట్టులో మార్పు లేదా!.. శార్దూల్ ఠాకూర్‎కు ఈసారి అవకాశం లేనట్టే..