T20 World Cup 2021: న్యూజిలాండ్‌తో ఆడే జట్టులో మార్పు లేదా!.. శార్దూల్ ఠాకూర్‌కు ఈసారి అవకాశం లేనట్టే..
న్యూజిలాండ్‌తో ఆడబోయే మ్యా్చ్లో భారత జట్టులో ఎలాంటి మార్పు చేయడం లేదని తెలుస్తోంది. ఆదివారం కీవిస్‌తో జరగనున్న 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆడిన టీంనే బరిలోకి దించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది...
న్యూజిలాండ్‌తో ఆడబోయే మ్యా్చ్లో భారత జట్టులో ఎలాంటి మార్పు చేయడం లేదని తెలుస్తోంది. ఆదివారం కీవిస్‌తో జరగనున్న ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆడిన టీంనే బరిలోకి దించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే జట్టులో ఎవకైనా ఫిట్నెస్ లేకపోతే మార్పు చేయనున్నారు. గత ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో తర్వాత మ్యాచ్‌లో జట్టులో మార్పు ఉండొచ్చని వార్తలు వచ్చాయి. ప్లేయింగ్ XIలో హార్దిక్ పాండ్యా స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చే అవకాశాన్ని ఉందని వచ్చిన వార్తలను టీం మేనేజ్మెంట్ తోసిపుచ్చింది. శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్లో ముంబై తరఫున వికెట్ టేకర్ అయినప్పటికీ అతను ఓవర్‌కు 9 పరుగుల ఎకానమీ రేటుతో చాలా పరుగులు ఇచ్చాడు. ఏడో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ తుది జట్టులోకి అతన్ని తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసే అవకాశం ఉండడంతో శార్దూల్‌కు ఛాన్స్ రాకపోవచ్చని తెలుస్తోంది.
శార్దూల్ ఇంకా ఆడే అవకాశం ఉంది. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ బ్లాక్ క్యాప్స్‌తో జరిగే మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణిస్తే అతన్ని తప్పించే అవకాశం లేదు. వరుణ్ చక్రవర్తి పూర్తిగా ఫిట్‌గా ఉంటే కివీస్‌తో మ్యాచ్‌లో ఉంటాడు. రవి చంద్రన్ అశ్విన్ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమాతో ఉన్నా జట్టులో మార్పు చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం జరగబోయే మ్యాచ్ భారత్ కీలకంగా మారింది. అటు న్యూజిలాండ్‌కు కూడా ఈ మ్యాచ్ ముఖ్యమే.. ఇండియా, న్యూజిలాండ్ రెండు పాక్ చేతిలో ఓడిపోయాయి. గ్రూప్-2 పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది అగ్రస్థానంలో ఉంది. ఆఫ్ఘానిస్తాన్ రెండు స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, భారత్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
గత ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 151 పరుగులు చేసింది. 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయ కేతనాన్ని ఎగరవేసింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుంచి తడబడింది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో భారత ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. సహచరులు ఔటైనా కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్, రవీంద్ర జాడేజాతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Read Also.. T20 World Cup: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం..