SA vs SL T20 World Cup 2021 Match Prediction: ఆత్మవిశ్వాసంతో ఒకరు.. అదృష్టాన్ని తిరగరాసే పనిలో మరోకరు..!

Today Match Prediction of SA vs SL: శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా టీంలు ఇప్పటి వరకు 16 మ్యాచుల్లో తలపడ్డాయి. అయితే ఇందులో 11 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, 5 మ్యాచుల్లో శ్రీలంక టీంలు విజయం సాధించాయి.

SA vs SL T20 World Cup 2021 Match Prediction: ఆత్మవిశ్వాసంతో ఒకరు.. అదృష్టాన్ని తిరగరాసే పనిలో మరోకరు..!
T20 World Cup 2021, Sa Vs Sl
Follow us
Venkata Chari

|

Updated on: Oct 30, 2021 | 9:00 AM

SA vs SL T20 World Cup 2021 Match Prediction: టీ20 ప్రపంచ కప్ 2021 ఎడిషన్‌లో 25 మ్యాచ్‌లో శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. శనివారం (అక్టోబర్ 30) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్లు పోటీపడనున్నాయి. రెండు మ్యాచ్‌లు ఆడగా, టోర్నీలో ఒక్కో గేమ్‌లో గెలిచాయి. గ్రూప్ 1లో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 3వ స్థానంలో నిలవగా, శ్రీలంక జట్టు 4వ స్థానంలో నిలిచింది.

ఎప్పుడు: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక, సూపర్ 12 గ్రూప్ 1, మధ్యాహ్నం 03:30 గంటలకు

ఎక్కడ: షార్జా క్రికెట్ స్టేడియం

లైవ్: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

పిచ్, పరిస్థితులు : షార్జా పిచ్‌లో బ్యాటింగ్‌కు అత్యంత కష్టతరమైన మైదానంగా పేరుగాంచింది. ఈ పిచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్లు రెండు అర్థ సెంచరీలు కూడా నమోదు చేశారు. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకుంటారు.

టీ20 హెడ్ టు హెడ్ రికార్డు: శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా టీంలు ఇప్పటి వరకు 16 మ్యాచుల్లో తలపడ్డాయి. అయితే ఇందులో 11 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, 5 మ్యాచుల్లో శ్రీలంక టీంలు విజయం సాధించాయి. ప్రపంచకప్ పోరులో 2-1తో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉంది.

దక్షిణాఫ్రికా జట్టు తన చివరి గేమ్‌లో వెస్టిండీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వెస్టిండీస్ 143/8 మంచి స్కోరును నమోదు చేసినా.. రాస్సీ వాన్ డెర్ డుస్సెన్‌ 51 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్‌, ఐడెన్ మార్క్రామ్ 200 స్ట్రైక్ రేట్ వద్ద 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచి దక్షిణాఫ్రికా టీంను విజయతీరాలకు చేర్చారు.

మరోవైపు, శ్రీలంక తమ మునుపటి ఎన్‌కౌంటర్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి బోర్డ్‌లో మొత్తం 154/6ని నమోదు చేసింది. కుసాల్ పెరెరా, చరిత్ అసలంక, భానుక రాజపక్సే 30 పరుగులు చేశారు. అయితే ఆ తర్వాత శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవిడ్ వార్నర్ కంగారూల తరఫున 42 బంతుల్లో 65 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఆరోన్ ఫించ్, స్టీవెన్ స్మిత్ సహకారంతో ఆస్ట్రేలియా టీం విజయం సాధించింది.

దక్షిణాఫ్రికా టీం విజయం ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో ఈ మ్యాచ్‌లోకి ప్రవేశించనుంది. అయితే శ్రీలంక తమ అదృష్టాన్ని తిరగరాసేందుకు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచులో తిరిగి విజయం సాధించేందుకు ఆశపడుతోంది.

మీకు తెలుసా?

న్యూజిలాండ్ మినహా ఇతర ప్రత్యర్థులపై కంటే శ్రీలంకపై టీ20లలో దక్షిణాఫ్రికా మెరుగైన విజయాలను కలిగి ఉంది. లంక, కివీస్‌లను 11 సార్లు దక్షిణాఫ్రికా ఓడించింది.

3 – 4000 టీ20 పరుగులు పూర్తి చేయడానికి రాస్సీ వాన్ డెర్ డుస్సెన్‌కు కేవలం 3 పరుగులు కావాలి.

51 – టీ20 క్రికెట్‌లో 500 పరుగులు పూర్తి చేయడానికి హెన్రిచ్ క్లాసెన్ 51 పరుగులు చేయాలి.

4 – 1500 టీ20 పరుగులు పూర్తి చేసిన రెండవ శ్రీలంక బ్యాటర్‌గా అవతరించడానికి కుశాల్ పెరీరాకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే అవసరం.

4 – అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేయడానికి లహిరు కుమారకు నాలుగు వికెట్లు అవసరం.

37 – అంతర్జాతీయ క్రికెట్‌లో 2500 పరుగులు పూర్తి చేయడానికి రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌కు 37 పరుగులు అవసరం.

3 – ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా మారడానికి తబ్రైజ్ షమ్సీ (29)కి మూడు వికెట్లు అవసరం. 2018లో 31 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ టై ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

4 – వనిందు హసరంగా (28) కూడా ఆండ్రూ టై స్కోరును దాటగలడు . మైలురాయిని అందుకోవాలంటే అతనికి నాలుగు వికెట్లు కావాలి.

50 – టీ20 ఇంటర్నేషనల్స్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన ఏడో శ్రీలంక బ్యాటర్‌గా అవతరించేందుకు దినేష్ చండిమాల్ 50 పరుగులు చేయాలి.

సౌత్ ఆఫ్రికా: క్వింటన్ డి కాక్ ఈ మ్యాచులో ఆడే అవకాశం ఉంది. డి కాక్ మోకాలిపై కూర్చోవడాన్ని వ్యతిరేకించిన తర్వాత, అతను ఈ మ్యాచులో ఎలా ఆడతాడనేది చూడాలి.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI అంచనా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నార్జే, తబ్రైజ్ షమ్సీ

శ్రీలంక: మిక్కీ ఆర్థర్ తాను ప్లేయింగ్ XIతో వీలైనంత తక్కువగా మార్పులు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే చమికా కరుణరత్నే కోసం అకిల దనంజయ లేదా ధనంజయ డి సిల్వాను తప్పించడం కష్టమేనని అన్నాడు. కుశాల్ పెరీరా టీ20 లలో కగిసో రబాడ నుంచి 17 బంతులు ఎదుర్కొని 29 పరుగులు చేశాడు.

శ్రీలంక ప్లేయింగ్ XI అంచనా: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా (కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, మహేశ్ తీక్షణ

Also Read: T20 World Cup 2021: న్యూజిలాండ్‎తో ఆడే జట్టులో మార్పు లేదా!.. శార్దూల్ ఠాకూర్‎కు ఈసారి అవకాశం లేనట్టే..

T20 World Cup: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న పాకిస్తాన్‌.. ఆఫ్గనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం..