UEFA Euro 2020: 25 ఏళ్ల తరువాత సెమీస్ చేరిన ఇంగ్లండ్.. డెన్మార్క్ తో అమీతుమీకి సిద్ధం..!

ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టు 25 ఏళ్ల విరామం తరువాత యూరో కప్ సెమీస్ చేరింది. నిన్న ఉక్రెయిన్ తో జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ టీం దూకుడు ప్రదర్శించి 4-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.

UEFA Euro 2020: 25 ఏళ్ల తరువాత సెమీస్ చేరిన ఇంగ్లండ్.. డెన్మార్క్ తో అమీతుమీకి సిద్ధం..!
Euro Cup England Team
Follow us
Venkata Chari

|

Updated on: Jul 05, 2021 | 2:39 PM

Euro 2020: ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టు 25 ఏళ్ల విరామం తరువాత యూరో కప్ సెమీస్ చేరింది. నిన్న ఉక్రెయిన్ తో జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ టీం దూకుడు ప్రదర్శించి 4-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా యూరో కప్‌ టైటిల్‌ సాధించలేకపోయింది. యూరో కప్ లో చివరిసారి 1996లో సెమీ ఫైనల్‌ చేరినా.. ఫైనల్ చేరలేకపోయింది. అంతకు ముందు 1966 ప్రపంచకప్‌ ఫైనల్లో పశ్చిమ జర్మనీపై 4-2తో గెలిచింది. అయితే, 1966 మ్యాచ్ తరువాత 4 గోల్స్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ టీం డెన్మార్క్‌తో పోరాడుతుంది. సెమీ ఫైనల్స్ బుధవారం నుంచి జరగనున్నాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఇటలీ, స్పెయిన్ ల మధ్య బుధవారం జరగనుంది. అలాగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం జరగనుంది. ఈరెండు సెమీ ఫైనల్స్ లో గెలిచిన జట్లు సోమవారం జరిగే ఫైనల్స్ లో తలపడతాయి.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ ఆటగాడు కెప్టెన్‌ హ్యారీ కేన్‌ ఆట 4 వ నిముషం, 50 వ నిముషంలో 2 గోల్స్‌ చేశాడు. అలాగే మరో ఆటగాడు. మగురె 46వ నిముషంలో, హెండర్సన్‌ 63వ నిముషంలో చేరో గోల్స్ చేశారు. దీంతో ఇంగ్లండ్ టీం 4-0 తేడాతో ఉక్రెయిన్ జట్టును ఓడించింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శించగా.. ఉక్రెయిన్‌ జట్టు ఏ దశలోనూ ఇంగ్లండ్ ప్లేయర్లను అడ్డుకోలేకపోయింది. ఉక్రెయిన్ పై గెలుపుతో ఇంగ్లండ్ టీం 62 వసారి యూరో కప్ బరిలో నిలిచి, మూడవ సారి సెమీఫైనల్ కు చేరుకుంది.

Also Read:

టీ 20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ..! 79 బంతుల్లో 205 పరుగులు..17 ఫోర్లు,17 సిక్సర్లు.. ఎవరో కాదు మన ఢిల్లీ క్రికెటరే..

Mohammad Azharuddin : మళ్లీ హెచ్‌సీఏ పగ్గాలు అజారుద్దీన్‌కే..! అపెక్స్‌ కౌన్సిల్‌ను రద్దు చేసిన అంబుడ్స్‌మన్‌