టీ 20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ..! 79 బంతుల్లో 205 పరుగులు..17 ఫోర్లు,17 సిక్సర్లు.. ఎవరో కాదు మన ఢిల్లీ క్రికెటరే..

ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి టీ 20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అజేయంగా డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 79 బంతుల్లో 205 పరుగులు చేశాడు.

టీ 20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ..! 79 బంతుల్లో 205 పరుగులు..17 ఫోర్లు,17 సిక్సర్లు.. ఎవరో కాదు మన ఢిల్లీ క్రికెటరే..
Subodh Bhati
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: Jul 05, 2021 | 9:02 AM

ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి టీ 20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అజేయంగా డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 79 బంతుల్లో 205 పరుగులు చేశాడు. 17 ఫోర్లు,17 సిక్సర్లు బాదాడు. సుబోధ్ భాటి 34 బంతుల్లో ఫోర్లు, సిక్సర్ల సాయంతో 170 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేటు 259గా ఉంది. ఢిల్లీ ఎలెవన్ జట్టు తరఫున ఆడుతున్న సుబోధ్ భాటి.. ప్రత్యర్థి సింబా జట్టుపై ఈ ఘనత సాధించాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 256 పరుగులు చేసింది. సుబోధ్ భాతితో పాటు సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి ఆరు పరుగులు చేశాడు. ఢిల్లీ ఎలెవన్ లక్ష్యానికి ప్రతిస్పందనగా సింబా జట్టు 18 వ ఓవర్లో 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. 57 పరుగుల తేడాతో ఓడిపోయింది.

టి 20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ సుబోధ్ భాటి అని మీడియా కథనాల్లో చెబుతున్నప్పటికీ ఇది నిజం కాదు. ఆయనకు ముందు శ్రీలంక క్రికెటర్ ధనుకా పాతిరానా ఈ ఘనత సాధించాడు. 2007 లో ఇంగ్లాండ్‌లో జరిగిన లాంక్షైర్ సాడిల్‌వర్త్ లీగ్‌లో ఆస్టర్‌ల్యాండ్స్ తరఫున ఆడుతున్నప్పుడు శ్రీలంకకు చెందిన ధనుకా పతిరానా 72 బంతుల్లో 277 పరుగులు చేశాడు. పతిరానా తన ఇన్నింగ్స్‌లో 29 సిక్సర్లు, 18 ఫోర్లు కొట్టాడు. అతని ఇన్నింగ్స్‌తో ఆస్టర్‌ల్యాండ్స్ జట్టు రెండు వికెట్లకు 366 పరుగులు చేసింది.

సుబోధ్ కెరీర్.. సుబోధ్ భాటి (30) మొదట ఉత్తర ప్రదేశ్ కు చెందినవాడు కానీ ఢిల్లీ జట్టు తరపున ఆడుతున్నాడు. అతను ఆల్ రౌండర్. ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ తరఫున 147 పరుగులు చేసి 19 వికెట్లు తీశాడు. అదే సమయంలో అతను 24 లిస్ట్ ఎ మ్యాచ్లలో 132 పరుగులు, 37 వికెట్లు తీశాడు. అతను 2015 సంవత్సరంలో దేశీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

MS Dhoni: అభిమాని కోరిక నేరవేర్చిన మహేంద్ర సింగ్ ధోనీ..!

ట్రాన్సాక్షన్ చేయకుండానే క్రెడిట్ కార్డ్ నుంచి రెండున్నర లక్షలు వాడినట్టు మెసేజ్ వచ్చింది.. అసలు కథ ఇదీ..!

యూపీ రాజధాని లక్నోలో కుప్పలా కూలిపోయిన మాజీ ఎంపీ బిల్డింగ్… రక్షిత కట్టడాల పరిధిలోనిదన్న అధికారులు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!