AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Marriage Day: పెళ్లి రోజు సందర్భంగా భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చిన మిస్టర్ కూల్..!

ఎంఎస్ ధోనీ.. తన భార్య సాక్షి కి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడంట. ఈమేరకు సాక్షి ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొస్ట్ చేయడంతో అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు.

MS Dhoni Marriage Day: పెళ్లి రోజు సందర్భంగా భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చిన మిస్టర్ కూల్..!
Dhoni Gifts A Car His Wife
Venkata Chari
|

Updated on: Jul 04, 2021 | 9:10 PM

Share

MS Dhoni: ఎంఎస్ ధోనీ.. తన భార్య సాక్షి కి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడంట. ఈమేరకు సాక్షి ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొస్ట్ చేయడంతో అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. అయినా.. సరే మనోడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత ఫామ్ హౌస్ లో భార్య సాక్షి, కూతురు జీవాలతో హ్యపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజగా ఈ మిస్టర్ కూల్ నేడు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య సాక్షి సింగ్‌ కు ఓ వింటేజ్ కార్ ను బహుమతిగా అందించాడు. 2010లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంటకు.. 11 ఏళ్లు నిండాయి. లేత నీలం, వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న వింటేజ్ కారును బహుమతిగా ఇచ్చినందుకు స్పెషల్ గా అభినందనలు చెబుతూ సాక్షి సింగ్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేసింది. ధోనీ మాత్రం సోషల్ మీడియాలో అంతగా అప్ డేట్స్ అందించడు, యాక్టివ్ గా కూడా ఉండదు. థోని భార్యనే ధోనీ సమాచారాన్ని అభిమానులకు చేరవేస్తోంది. ధోనీ కూతురు జీవా ప్రస్తుతం ఐదేళ్లు. జీవాకి కూడా ఇన్‌స్టాలో అకౌంట్ ఉంది. దీనికి 2 మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉన్నారు.

11 వ వార్షికోత్సవం సదర్భంగా పలువురు వారి వివాహానికి సంబంధించిన ఫొటోలను సాక్షి కి ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 16 ఏళ్ల పాటు టీమిండియాకు సేవలు అందించిన ధోనీ.. వరల్డ్ కప్ సాధించి, కపిల్ తరువాత అంతటి ఖ్యాతిని పొందాడు. అలాగే టీమిండియాకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్ గానూ తన పేరును భారత క్రికెట్ లో లిఖించాడు.

Also Read:

Lionel Messi: క్రిస్టియానో రొనాల్డో రికార్డ్‌ను బ్రేక్ చేసిన అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ..!

TeamIndia: గిల్ గాయం దాచడం ఆశ్చర్యంగా ఉంది: టీమిండియా మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌