AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TeamIndia: గిల్ గాయం దాచడం ఆశ్చర్యంగా ఉంది: టీమిండియా మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టులో ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ లో తలపడనుంది. తాజాగా టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ గాయంపై వివాదాలు చెలరేగుతున్నాయి.

TeamIndia: గిల్ గాయం దాచడం ఆశ్చర్యంగా ఉంది: టీమిండియా మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌
Gill And Saba Karim
Venkata Chari
|

Updated on: Jul 04, 2021 | 8:02 PM

Share

TeamIndia: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టులో ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ లో తలపడనుంది. తాజాగా టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ గాయంపై వివాదాలు చెలరేగుతున్నాయి. బీసీసీఐ అధికారులపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌, కపిల్ దేవ్ ఫైరవుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందే గిల్‌ గాయపడితే ఆ విషయాన్ని దాచిపెట్టడంపై సాబా కరిమ్ మండిపడుతుంటే, పృథ్వీ షాను ఇంగ్లండ్ పంపాలకుకోవడం అక్కడున్న ఎక్స్ ట్రా ప్లేయర్లను అవమానించినట్లేనని టీమిండియా మాజీ సారథి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా గిల్ గాయం టీమిండియాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. సాబా కరిమ్ మాట్లాడుతూ, భారత జట్టులో ఫిజియోలు, ట్రెయినర్లు ఎంతో మంది ఉన్నా.. గిల్ గాయాన్ని ఒక్కరు కూడా కనిపెట్టలేకపోయారని, బీసీసీఐ పొరపాటుతోనే ఈయువ ఓపెనర్ రెండు నెలలు మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉందంటూ ఆయన విమర్శించారు. ‘గిల్‌ తన గాయాన్ని దాచిపెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ యంగ్ ఓపెనర్ చాలా కాలంగా జట్టుతో ప్రయాణిస్తున్నాడు. ఫిజియోలు, వైద్య సహాయకులు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ను తరచుగా పరీక్షిస్తుంటారు. మరి గిల్ గాయం బయటపడకపోవడం ఎలా సాధ్యమైంది. అసలా గాయం ఎప్పుడు తగిలింది. యంగ్ బ్యాట్స్ మెన్ ఎందుకు గాయాన్ని దాచిపెట్టాడు’ లాంటి విషయాలు వితంగా ఉన్నాయి. గాయం గురించి తెలిస్తే.. జట్టు నుంచి తొలగిస్తారని.. ఆ విషయాన్ని గిల్ దాచిపెట్టి ఉంటాడనే అనుకుంటున్నారు.

ఆగస్టు 4 నుంచి టీమిండియా.. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ లో తలపడనుంది. ఇంగ్లండ్ సిరీస్ మొదలుకాకముందే శుభ్‌మన్ గిల్ గాయంతో సిరీస్ కు దూరమవ్వడంతో.. టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గిల్ పిక్క కండరాలు పట్టేయడంతో తీవ్రంగా బాధపడుతున్నాడని, దాదాపు 8 వారాల విశ్రాంతి అవసమరని మేనేజ్మెంట్ పేర్కొంది. దీంతో గిల్ ఇంగ్లండ్ సిరీస్ కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, టీం మేనేజ్మెంట్ పృథ్వీ షా ను ఇంగ్లండ్ పంపాలని బీసీసీఐ ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు బీసీసీఐ ఈ యువ బ్యాట్స్ మెన్ ను ఇంగ్లండ్ పంపించే పనిలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పృథ్వీ షా శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే టీమిండియాకు అదనంగా కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, అభిమన్యు ఈశ్వరన్‌ లాంటి వారు ఓపెనింగ్ చేసేందుకు జట్టుతో వెళ్లారు. ఇప్పుడున్న సమాచారం మేరకు రోహిత్‌ శర్మతో పాటు అగర్వాల్‌ను బరిలోకి దింపేందుకు టీం సిద్ధమైందని తెలుస్తోంది. ఇక కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఈశ్వరన్‌ ఆడలేదు కాబట్టి, ఇతనికి అవకాశం ఇవ్వకపోవచ్చని అనుకుంటున్నారు. అయితే, ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్‌ ఆడనుండడంతో ముందు జాగ్రత్తగా పృథ్వీ షాను ఇంగ్లండ్ ను పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read:

Team India: పృథ్వీషాను కోరినట్లైతే.. వాళ్లను అవమానించినట్లే: మాజీ సారథి కపిల్ దేవ్

Wimbledon 2021: మూడో రౌండ్లోకి సానియా మీర్జా – రోహన్ బోపన్న జోడీ..!