Lionel Messi: క్రిస్టియానో రొనాల్డో రికార్డ్‌ను బ్రేక్ చేసిన అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ..!

అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ రికార్డులకు రారాజుగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రికార్డును సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఫ్రీకిక్ గోల్స్ రికార్డును బ్రేక్ చేసి అరుదైన రికార్డును నెలకొల్పాడు.

Lionel Messi: క్రిస్టియానో రొనాల్డో రికార్డ్‌ను బ్రేక్ చేసిన అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ..!
Lionel Messi
Follow us
Venkata Chari

|

Updated on: Jul 04, 2021 | 9:06 PM

Lionel Messi: అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ రికార్డులకు రారాజుగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రికార్డును సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఫ్రీకిక్ గోల్స్ రికార్డును బ్రేక్ చేసి అరుదైన రికార్డును నెలకొల్పాడు. కోపా అమెరికా క‌ప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా ఈ రికార్డును సాధించాడు. ఈక్వెడార్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పోర్చుగ‌ల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మొత్తం 3 గోల్స్ చేసింది. అన్నింటిలోనూ మెస్సీ తన సత్తా చూపాడు. తొలి రెండు గోల్స్‌లో బాల్‌ను పాస్ చేసిన మెస్సీ.. ఓ ఫ్రీకిక్‌ను గోల్‌గా మ‌ల‌చడంతో అర్జెంటీనా 3-0 లీడ్ పొందింది. ఈ క్రమంలోనే రొనాల్డో రికార్డును మెస్సీ అర్జెంటీనా స్టార్‌ బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు రొనాల్డో ఫ్రీకిక్స్‌తో 57 గోల్స్‌తో తొలి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌తో మెస్సీ 58వ సారి ఫ్రీకిక్‌ గోల్ సాధించి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. మెస్సీ ప్రస్తుతానికి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 76 గోల్స్‌ సాధించాడు. మరో గోల్ చేస్తే అత్యధిక గోల్స్ సాధించిన సౌత్ అమెరిక‌న్‌గా రికార్డు క్రియోట్ చేయనున్నాడు. ఈ జాబితాలో దిగ్గజ ఫుట్‌బాలర్‌, బ్రెజిల్‌ మాజీ కెప్టెన్‌ పీలే 77 గోల్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు.

అలాగే ఈ అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ సాకర్‌లోనూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. బార్సిలోనా తరఫున 644వ గోల్ సాధించాడు. ఈ రికార్డుతో ఫుట్‌బాల్ చరిత్రలో ఒక క్లబ్‌ తరఫున అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు బ్రెజిలియన్‌ దిగ్గజ ఆటగాడు పీలే పేరిట ఉంది. ఆయన శాంటోస్‌ తరఫున 19 సీజన్లలో 665 మ్యాచ్‌ల్లో 643 గోల్స్‌ కొట్టాడు. 17 సీజన్లలో 748 మ్యాచ్‌ల్లో పీలే రికార్డును మెస్సీ అధిగమించాడు.

Also Read:

TeamIndia: గిల్ గాయం దాచడం ఆశ్చర్యంగా ఉంది: టీమిండియా మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌

Wimbledon 2021: మూడో రౌండ్లోకి సానియా మీర్జా – రోహన్ బోపన్న జోడీ..!

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.