Tokyo Olympics: దక్షిణ కొరియా, జపాన్‌లకు ఉ.కొరియా షాక్…టోక్యో ఒలంపిక్స్‌కు దూరం..
Tokyo Olympics - North Korea: పొరుగుదేశాలు దక్షిణ కొరియా, జపాన్‌లకు ఉత్తరకొరియా షాక్ ఇచ్చింది. టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొనకూడదని ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది.
పొరుగుదేశాలు దక్షిణ కొరియా, జపాన్‌లకు ఉత్తరకొరియా షాక్ ఇచ్చింది. టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొనకూడదని ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కారణంగా తమ దేశ క్రీడాకారుల ఆరోగ్యానికి దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరకొరియా క్రీడా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఓ అధికారిక వెబ్‌సైట్ ప్రకటించింది. ఒలంపిక్స్ క్రీడలతోనైనా తరచూ కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాతో తమ స్నేహ సంబంధాలు మెరుగవుతాయని ఆశించిన ద.కొరియా, జపాన్ దేశాలు…ఇప్పుడు ఉ.కొరియా తీసుకున్న నిర్ణయంతో షాక్‌కు గురైయ్యాయి. జపాన్ రాజధానిలో జరగనున్న ఒలంపిక్స్‌కు దూరంగా ఉండాలన్న ఉ.కొరియా నిర్ణయంపై దక్షిణ కొరియా విస్మయం వ్యక్తంచేసింది. ఉభయ కొరియా దేశాల మధ్య మైత్రీ సంబంధాలు మెరుగుపడేందుకు టోక్యో ఒలంపిక్స్ దోహదపడుతుందని తాము ఆశించినట్లు పేర్కొంది.
గత కొంత కాలంగా ఉత్తర కొరియా పొరుగుదేశాలతో కయ్యానికి కాలుదువ్వుతోంది. అమెరికా – ఉ.కొరియా మధ్య అణు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో పాటు…కిమ్ జోంగ్-ఉన్ యంత్రాంగం క్షిపణి పరీక్షలతో పొరుగుదేశాలను కవ్విస్తోంది. మరీ ముఖ్యంగా ఉ.కొరియా తీరు ద.కొరియా, జపాన్ దేశాలను తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టోక్యో ఒలంపిక్స్ పోటీలతో ఉ.కొరియాతో సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చని ద.కొరియా, జపాన్ దేశాలు భావించాయి.
అయితే టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొనకూడదని ఉ.కొరియా నిర్ణయించుకోవడంతో ద.కొరియా, జపాన్‌లు షాక్‌కు గురైయ్యాయి. అయితే దీనిపై తక్షణమే స్పందించేందుకు జపాన్ ఒలంపిక్స్ మంత్రి తమయో మరుకవా నిరాకరించారు. టోక్యో ఒలంపిక్స్ నుంచి వైదొలగుతున్నట్లు ఉ.కొరియా నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా రాలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి..Google Vaccination: లాక్‌డౌన్, క్వారంటైన్, సోషల్ డిస్టెన్స్… వ్యాక్సినే చేసుకుంటే ఇవేవీ ఉండవు. గూగుల్ వీడియో.
నాన్న సినిమా చూడు.. మరణించిన కొడుకు ఫోటోతో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన తండ్రి