మేరీ కోమ్ సంచలన నిర్ణయం.. ఆ పోటీలకు దూరం.. కారణం ఏంటో తెలిస్తే

మేరీ కోమ్ సంచలన నిర్ణయం.. ఆ పోటీలకు దూరం.. కారణం ఏంటో తెలిస్తే
Mary Kom

భారత దిగ్గజ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్(Mary Kom) సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఛాంపియన్‌ షిప్స్, ఆసియా గేమ్స్‌లో పాల్గొనకూడదని..

Ganesh Mudavath

|

Mar 06, 2022 | 8:33 PM

భారత దిగ్గజ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్(Mary Kom) సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఛాంపియన్‌ షిప్స్, ఆసియా గేమ్స్‌లో పాల్గొనకూడదని నిశ్చయించుకున్నారు. ఆరుసార్లు ప్రపంచ విజేత అయిన మేరీకోమ్.. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌పై దృష్టి సారించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 6 నుంచి 21 మధ్య టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. జులై 28న కామన్‌వెల్త్ గేమ్స్, సెప్టెంబరు 10న ఆసియా గేమ్స్(Asia Games) జరగనున్నాయి. కొత్త తరానికి చోటివ్వాలన్న ఉద్దేశంతో తాను ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఆసియా గేమ్స్ నుంచి వైదొలగతున్నట్టు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ)కి మేరీకోమ్ తెలిపారు.

మరోవైపు టోక్యో ఒలింపిక్స్-2020లో బాక్సింగ్ మహిళల​ ప్రీ క్వార్టర్స్​లో మేరికోమ్ ఓడిపోయారు. కచ్చితంగా పతకం తీసుకొస్తుందనుకున్న ఈ సీనియర్ క్రీడాకారిణి.. మహిళల 51 కేజీల విభాగంలో కొలంబియా బాక్సర్​వాలెన్సియాతో జరిగిన పోరులో 2-3 తేడాతో పరాజయం పాలయ్యారు. ఫలితంగా ఒలింపిక్స్​నుంచి నిష్క్రమించారు. పతకం తీసుకొస్తుందని ఆశగా చూసిన అభిమానులను నిరాశపరుస్తూ.. క్వార్టర్స్​కు కూడా ఆర్హత సాధించలేకపోయారు మేరీ కోమ్. అయితే ఈ మ్యాచ్ లో జడ్జీల నిర్ణయంపై మేరీ కోమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రౌండ్ల బౌట్​లో రెండింట్లో గెలిచినా.. ఆమె ఓటమి పాలయ్యారు. తానే గెలిచినట్లు అనుకున్నానని, తనకు అన్యాయం జరిగిందని మేరీకోమ్ తెలిపారు.

Also Read

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..

Viral Video: కారు వేగంతో జింక పోటీ.. చిరుతను మించిన వేగంతో !! వీడియో

షాకింగ్.. విపరీతమైన జలుబు.. కట్ చేస్తే.. 20 ఏళ్ల గతాన్ని మర్చిపోయిన మహిళ.. వీడియో

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu