మైనర్‌తో లైంగిక సంబంధం.. ఒలింపిక్ విజేతపై కేసు నమోదు.. దోషిగా తేలితే..!
ప్రముఖ స్పింటర్, కెన్యా ఒలింపిక్ విజేత కాన్సెస్లస్ కిప్రుటో కేసు నమోదైంది. మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న కేసులో అతడిని నవంబర్ 11న అరెస్ట్ చేశారు.
Conseslus Kipruto Olympic: ప్రముఖ మిడిల్ డిస్టేన్స్ రన్నర్, కెన్యా ఒలింపిక్ విజేత కాన్సెస్లస్ కిప్రుటో కేసు నమోదైంది. మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న కేసులో అతడిని నవంబర్ 11న అరెస్ట్ చేశారు. అయితే ప్రాథమిక విచారణలో అతడు దోషిగా తేలకపోవడంతో 1600 డాలర్ల పూచికత్తుపై 16న బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. (ఇవాళ కరోనా పుట్టినరోజు.. సరిగ్గా ఏడాది క్రితం మొదటి కేసు ఎక్కడ నమోదైందంటే)
కాగా ప్రస్తుతం ఓ పోలీస్‌గా పనిచేస్తున్న ఈ ఒలింపిక్ స్వర్ణ విజేత 15 ఏళ్ల మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నారు. దీంతో అపవిత్రత కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఒకవేళ ఇందులో కిప్రుటో దోషిగా తేలితే అతడికి 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాగా ఆ బాలిక మూడు రోజులు కనిపించకుండా పోగా.. ఆ సమయంలో కిప్రుటో ఇంట్లో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. కాాగా 2016 రియో ఒలింపిక్స్‌లో కిప్రుటో బంగారు పతకాన్ని సాధించారు. (తమిళ ‘బిగ్‌బాస్’లో కమల్ నోట శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’.. పతితులారా అంటూ అదరగొట్టిన లోకనాయకుడు)