రిటైర్మెంట్ సమయంలో సచిన్‌కు లారా-గేల్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు సచిన్ టెండుల్కర్ గుడ్ బై చెప్పి సోమవారానికి(నవంబరు 16) ఏడేళ్లు కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్వీట్ చేసిన మాస్టర్ బ్లాస్టర్...
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు సచిన్ టెండుల్కర్ గుడ్ బై చెప్పి సోమవారానికి(నవంబరు 16) ఏడేళ్లు కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్వీట్ చేసిన మాస్టర్ బ్లాస్టర్… వెస్టిండీస్‌పై ఇండియా తరపున లాస్ట్ టెస్టు ఆడిన అనంతరం బ్రియాన్ లారా, క్రిస్ గేల్ తనకు స్పెషల్ గిఫ్ట్ అందించారని చెప్పాడు.
#OnThisDay 7️⃣ years ago @windiescricket and my friends @BrianLara & @henrygayle presented me with this beautiful steel drum.?
I will always be grateful for such a wonderful gift and thank them for their love and respect.
Thank you once again. ??♥️@BCCI pic.twitter.com/JtpZB8XV1Z
— Sachin Tendulkar (@sachin_rt) November 16, 2020
“సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున వెస్టిండీస్ టీమ్‌తో పాటు నా మిత్రులైన బ్రియాన్ లారా, క్రిస్ గేల్ ఈ అందమైన స్టీల్ డ్రమ్‌ను నాకు బహుమతిగా ఇచ్చారు. ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. వారి ప్రేమా అభిమానాలకు ధన్యావాదాలు” అని సచిన్ పేర్కొన్నాడు.
కాగా బ్రియాన్ లారా తన ఇంటికి వచ్చినప్పుడు డ్రమ్‌ను వాయించాడని సచిన్ వెల్లడించాడు. లారాను అనుసరిస్తూ తానూ డ్రమ్‌ను మోగిస్తున్నానని చెప్పాడు. 2013 నవంబరు 16న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌పై సచిన్ తన ఫైనల్ టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్ అనంతరం అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు సచిన్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో మాస్టర్ 74 రన్స్ చేసి ఔటయ్యాడు. తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సెంచరీ చేయనుందుకు సచిన్ చాలా బాధపడ్డాడు.
Also Read :
విషాదం.. దీపావళి వేడుకల్లో బీజేపీ ఎంపీ మనవరాలు మృతి
పాపం.. టపాసు పేలి..అతడి కొత్త కారు పూర్తిగా దగ్ధమైంది
ప్రయాణీకులకు గుడ్ న్యూస్..నేటి నుంచి గ్రేటర్లో 50 శాతం బస్సులు