Junior Asia Cup 2023: ఖాతా తెరవనివ్వకుండానే తైవాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఎంత తేడాతో గెలిచారంటే..?
Junior Asia Cup 2023: ఓమన్‌లోని సలాలా వేదికగా జరుగుతున్న జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌ని భారీ విజయంతో బోణీ కొట్టింది. చైనీస్ తైపీతో బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ టీమ్ ప్రత్యర్థిపై గోల్స్ వర్షం కురిపించడమే
Junior Asia Cup 2023: ఓమన్‌లోని సలాలా వేదికగా జరుగుతున్న జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌ని భారీ విజయంతో బోణీ కొట్టింది. చైనీస్ తైపీతో బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ టీమ్ ప్రత్యర్థిపై గోల్స్ వర్షం కురిపించడమే కాక 18–0 తేడాతో ఘన విజయం సాధించింది. భారత యువ ఆటగాళ్ల ధాటికి చేసేదేం లేక చైనీస్ తైపీ ఆటగాళ్లు చేతులెత్తేశారు. భారత్ తరఫున 19వ నిముషంలో 2, 30వ నిముషంలో 1, 59వ నిముషంలో మరొకటి చొప్పుడన అరైజీత్ సింగ్ హుండల్ 4 గోల్స్… అలాగే 38వ, 39వ, 41వ నిముషాల్లో అమన్‌దీప్ కూడా 3 గోల్స్ సాధించారు.
వీరిద్దరే కాక బాబీ సింగ్ ధామి(10వ, 46వ నిముషాల్లో) 2 గోల్స్, ఆదిత్య అర్జున్ లలాగే(37వ, 37వ నిముషాల్లో) 2 గోల్స్, కెప్టెన్ ఉత్తమ్ సింగ్(10వ, 59వ నిముషాల్లో) 2 గోల్స్ చొప్పున నమోదు చేశారు. అలాగే శ్రద్ధానంద్ తివారి(11వ నిముషంలో), అంగద్‌బీర్ సింగ్(37వ నిముషంలో), అమీర్ అలీ (51వ నిముషంలో), బాబీ పూవణ్ణ చంద్ర (54వ నిముషంలో), యోగాంబర్ (60వ నిముషంలో) ఒక్కో గోల్ చేశారు.
What a Match ?
Defending Champion India announce themselves as the favourites with a thunderous start to their campaign against Chinese Taipei.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/JX5n5LY9lt
— Hockey India (@TheHockeyIndia) May 24, 2023
అయితే ఈ క్రమంలో చెనీస్ తైపీ తరఫున ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ సమయం ముగిసే సరికి 18–0 తేడాతో చైనీస్ తైపీపై భారత్ జూనియర్ హాకీ టీమ్ విజయం సాధించింది. మరోవైపు గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో టీమిండియా తలపడబోతోంది. కాగా, ఈ ఆసియా కప్ టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్ ప్రపంచకప్ టోర్నీకి నేరుగా క్వాలిఫై అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..