AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Points Table : ఓడినా టాప్ 4లో పంజాబ్.. గెలిచినా ముంబైకి దక్కని ఫలితం.. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు ఇవే

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ వరుసగా 5 ఓటములతో కుదేలయింది. ముంబై గెలిచినా 9వ స్థానంలోనే ఉండగా, ఆర్సీబీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

IPL 2026 Points Table : ఓడినా టాప్ 4లో పంజాబ్.. గెలిచినా ముంబైకి దక్కని ఫలితం.. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు ఇవే
Ipl 2026
Rakesh
|

Updated on: May 15, 2026 | 8:04 AM

Share

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ పాయింట్ల పట్టికలో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజా మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించినప్పటికీ, ఇరు జట్ల స్థానాల్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. పంజాబ్ కింగ్స్ పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. వరుస ఓటములు ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లుతుండగా, ముంబై గెలిచినా కేవలం పరువు కాపాడుకోవడానికే పరిమితమైంది.

ఈ సీజన్ మొదట్లో పంజాబ్ కింగ్స్ ఒక రేంజ్‌లో దూసుకుపోయింది. ఆడిన మొదటి 7 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోకుండా 13 పాయింట్లతో టేబుల్ టాప్‌లో నిలిచింది. కానీ, సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు వరుసగా 5 మ్యాచ్‌లలో ఓడిపోయి అభిమానులను షాక్‌కు గురిచేసింది. అయితే, గతంలో సంపాదించిన పాయింట్ల పుణ్యమా అని ఇప్పటికీ 13 పాయింట్లతో, +0.355 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలోనే కొనసాగుతోంది. కానీ ఇకపై జరిగే రెండు మ్యాచ్‌లలో పంజాబ్ కచ్చితంగా గెలవాల్సిందే. లేదంటే ఇంటికి వెళ్లక తప్పదు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 58వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి పంజాబ్ ప్లే ఆఫ్స్ దారిని అడ్డుకుంది. అయితే ఈ విజయం వల్ల ముంబైకి ఒరిగేదేమీ లేదు. ఆడిన 12 మ్యాచ్‌లలో ముంబైకి ఇది కేవలం 4వ విజయం మాత్రమే. 8 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో 9వ స్థానంలోనే ఉంది. ముంబై కంటే కింద లక్నో సూపర్ జెయింట్స్ (6 పాయింట్లు) మాత్రమే ఉంది. ముంబై అప్పుడే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ విజయం కేవలం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది.

పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 12 మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. ఆర్సీబీ నెట్ రన్ రేట్ (+1.053) చాలా మెరుగ్గా ఉండటం వారికి కలిసొచ్చే అంశం. అటు గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండి ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది.

Follow Us