Viral : ఏంటయ్యా ఇది.. కనీసం ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా? లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా సాగాయి. రాంచీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రాయ్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది. దీంతో శనివారం, డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగబోయే మూడో మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. భారత ఆటగాళ్లు విశాఖపట్నం చేరుకున్నారు.

Viral : భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా సాగాయి. రాంచీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రాయ్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది. దీంతో శనివారం, డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగబోయే మూడో మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. భారత ఆటగాళ్లు విశాఖపట్నం చేరుకున్నారు. అయితే ఈ ప్రయాణానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ముఖ్య ఆటగాళ్లు కూడా తమ సామానును సొంతంగా మోసుకెళ్తూ ఎస్కలేటర్‌పై పైకి ఎక్కడం కనిపిస్తోంది. దీని కారణంగా ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్కలేటర్ పనిచేయక ఇబ్బందులు
వైరల్ అవుతున్న ఈ వీడియో రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించినదని తెలుస్తోంది. టీమిండియా ప్లేయర్లు మూడో వన్డే కోసం రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం బయలుదేరుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కేవలం మూడు రోజుల ముందే భారత, సౌతాఫ్రికా జట్లు ఇక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఎయిర్‌పోర్టులో ఉన్న ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ఎస్కలేటర్ ఆగిపోయి ఉండటంతో, ఆటగాళ్లందరూ దానిపైనే తమ భారీ లగేజీని మోస్తూ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వీడియోలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ లగేజీని స్వయంగా తీసుకెళ్తూ కనిపించారు.
This is the escalator at Raipur airport which is not working, because of which the Indian team players have to carry their luggage and walk up. It’s such a big and modern airport, yet they can’t even fix one escalator. And even after knowing that the Indian team was going to… pic.twitter.com/WzcrI6P7uO
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 5, 2025
సోషల్ మీడియాలో సెటైర్లు
రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్లు పడుతున్నాయి. ఒక యూజర్ రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ సోషల్ మీడియా పేజీని ట్యాగ్ చేస్తూ “ఇంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో కనీసం ఒక్క ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయించలేరా? భారత జట్టు వస్తుందని తెలిసినా కూడా రిపేర్ చేయకపోవడం ఏంటి? ఇంత పెద్ద సమస్యను ఎలా క్రియేట్ చేయగలిగారు ?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో, ప్రముఖ అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడంపై నెటిజన్లు ఎయిర్‌పోర్ట్ అధికారులను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు.




