AIBA World Boxing Championship: ఏఐబీఏ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తలపడనున్న 20 మంది భారత బాక్సర్లు..
AIBA World Boxing Championships: త్వరలో జరగబోయే టోక్యో ఒలింపిక్ గేమ్స్‌కు భారత దేశం నుంచి తొమ్మిది మంది బాక్సర్లు అర్హత..
AIBA World Boxing Championships: త్వరలో జరగబోయే టోక్యో ఒలింపిక్ గేమ్స్‌కు భారత దేశం నుంచి తొమ్మిది మంది బాక్సర్లు అర్హత సాధించారు. దాంతో సీనియర్ బాక్సర్లు అందరూ ఒలింపిక్స్‌పై దృష్టిసారించారు. కరోనా సంక్షోభం తరువాత భారత జూనియర్ బాక్సర్లు కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు పోటీ పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలాండ్‌లోని కీల్స్‌లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న ఏఐబీఏ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కోసం 20 మంది యువ బాక్సర్ల పేర్లను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
మహిళల బృందంలో నోరెం బాబిరోజిసానా చాను (51 కిలోలు), వింకా (60 కిలోలు), సనంచ చాను (75 కిలోలు), అల్ఫియా పఠాన్ (81 కిలోలకు పైగా), అరుంధతి చౌదరి ( 69 కిలోలు), గీతిక (48 కేజీలు), అర్షి ఖనం (54 కేజీలు), పూనమ్ (57 కేజీలు), నిషా (64 కేజీలు), ఖుషి (81 కేజీలు) భారత్ తరఫున బాక్సింగ్ కాంపిటేషన్‌లో పాల్గొననున్నారు.
ఇక పురుషుల విషయంలో చాలా మంది ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. పురుషుల బాక్సర్ల బృందానికి ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత అంకిత్ నార్వాల్(64 కిలోలు) నాయకత్వం వహించనున్నారు. ఇక చోంగ్‌థమ్ విశ్వమిత్ర (49 కిలోలు) వికాస్ (52), సచిన్ (56 కిలోలు), ఆకాష్ గూర్ఖా (60 కిలోలు), సుమిత్ (69 కిలోలు), మనీష్ (75 కిలోలు), వినీత్ (81 కిలోలు), విశాల్ గుప్తా (91 కిలోలు), ఫైర్‌ఫ్లై (91 కిలోల కంటే ఎక్కువ) ఉన్నారు. కాగా, బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే ముందు, భారత బృందం 10 రోజుల సన్నాహక శిబిరంలో పాల్గొంటుంది. అందుకోసం మార్చి 31వ తేదీనే పోలాండ్ బయలుదేరుతుంది.
Also read: