IKF S3 Finale: యువ ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ కల సాకారం చేస్తున్న.. ఇండియా ఫుట్‌బాల్‌ ఖేలో

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4వ తేదీన అహ్మదాబాద్‌లోని ఈకేఏ ఎరీనాలో జరిగే గ్రాండ్‌ ఫినాలేలో పాల్గొనేందుకు 150 మంది ప్రతిభాంతులైన ఫుట్‌బాల్‌ క్రీడాకారులు షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. దీంతో ఇండియా ఫుట్‌బాల్‌ ఖేలో మూడో సీజన్‌కు గొప్ప ముగింపు లభించింది. 8 నెలలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు యునైటెడ్‌...

IKF S3 Finale: యువ ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ కల సాకారం చేస్తున్న.. ఇండియా ఫుట్‌బాల్‌ ఖేలో
IKF
Follow us

|

Updated on: Feb 09, 2024 | 10:46 PM

ఇండియా ఫుట్‌బాల్‌ ఖేలో కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ఔత్సాహిక క్రీడాకారులను వెలికి తీస్తున్నారు. గ్రామాల్లో నుంచి ప్రొఫెషనల్ ఫుట్‌బాట్‌ ప్లేయర్స్‌ను ఎంపిక చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ టోర్నీలో సత్తా చాటిన వర్ధమాన ఫుట్‌బాల్‌ క్రీడాకారులను అగ్రశ్రేణి భారతీయ క్లబ్‌లకు (ISL & I-లీగ్) అలాగే యునైటెడ్ స్టేట్స్‌లోని అంతర్జాతీయ అకాడమీలు, విశ్వవిద్యాలయాలకు పంపించి మరింత శిక్షణ ఇప్పిస్తారు.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4వ తేదీన అహ్మదాబాద్‌లోని ఈకేఏ ఎరీనాలో జరిగే గ్రాండ్‌ ఫినాలేలో పాల్గొనేందుకు 150 మంది ప్రతిభాంతులైన ఫుట్‌బాల్‌ క్రీడాకారులు షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. దీంతో ఇండియా ఫుట్‌బాల్‌ ఖేలో మూడో సీజన్‌కు గొప్ప ముగింపు లభించింది. 8 నెలలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరిగింది. ఇందులో 10వేలకిపైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇండియా, యూఏఈలోని 50 నగరాల్లో నిర్వహించిన ఫిజికల్‌ ట్రయల్స్‌లో 2066 నుంచి 2011 మధ్య జన్మించిన అబ్బాయిలు, 2007 నుంచి 2011 మధ్య జన్మించిన బాలికలు పాల్గొన్నారు. జోనల్‌ ఫైనల్స్‌ ద్వారా ఆటగాళ్ల తుది జాబితాను గుర్తించారు.

Foot Ball

ప్రతిభావంతులైన ఫుట్‌బాల్‌ ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు మొత్తం 20కిపైగా ప్రత్యర్థి క్లబ్స్‌, అకాడమీలు ఒకే గొడుగు కిందికి వచ్చాయి. జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్‌, గోవా ఎఫ్‌సీ, ముంబయి సిటీ ఎఫ్‌సీ, చెన్నై ఎఫ్‌సీ జట్లు ఫైనల్స్‌లో పాల్గొన్నాయి. ఇక ఐ లీగ్‌ క్లబ్‌లు స్కాట్ చేయడానికి గోకులం కేరళ, ఢిల్లీ ఎఫ్‌సీ, బరోడా ఫెయిర్‌, మహారాష్ట్ర ఆరెంజ్‌ ఎఫ్‌సీ, యునైటెడ్‌ ఎస్‌సీ కోల్‌కతా, మిల్లత్‌ ఎఫ్‌సీలు పాల్గొన్నాయి.

Ikf Final

టాప్‌ అకాడమీలుగా ఎఫ్‌సీ మద్రాస్‌, జింక్‌ ఎఫ్‌ఏ, ఆల్ఫా స్పోర్ట్స్‌ అకాడమీలు, ఆర్డోర్‌ ఎఫ్‌ఏ, విశాల్‌ బిహార్‌ యునైటెడ్‌, స్పోర్టో , ఉత్తర యునైటెడ్‌ నిలిచాయి. ఇక ఫిబ్రవరి 4 తేదీన జరిగిన ఇండియన్‌ ఖేలో ఫుట్‌బాల్‌ సీజన్‌ 3 ఫైనల్స్‌ తర్వాత పాల్గొన్న క్లబ్‌లు, అకాడమీలు తన ఎంపికలను ఇండియన్‌ ఖేలో ఫుట్‌బాల్‌కు సమర్పించనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..