Ranji Trophy: 68 బంతుల్లో తుఫాన్ సెంచరీ.. టెస్ట్‌ మ్యాచ్‌లో టీ20 దూకుడు.. రికార్డ్ సృష్టించిన కోహ్లీ ఫ్రెండ్

Rajat Patidar Century in Madhya Pradesh vs Haryana Match: మధ్యప్రదేశ్, హర్యానా మధ్య జరిగిన రంజీ టోర్నీ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. దీంతో రంజీ టోర్నీలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Venkata Chari

|

Updated on: Oct 29, 2024 | 5:24 PM

Rajat Patidar: Madhya Pradesh vs Haryana: ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ సెంచరీతో సత్తా చాటాడు. అది కూడా కేవలం 68 బంతుల్లోనే కావడం విశేషం. హర్యానాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరపున మూడో నంబర్‌లో ఫీల్డింగ్‌లోకి వచ్చిన పాటిదార్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

1 / 5
ఆరంభం నుంచే భీకర బ్యాటింగ్ ప్రదర్శించిన పాటిదార్ హర్యానా బౌలర్లను చిత్తు చేశాడు. ఫలితంగా పాటిదార్ బ్యాట్ నుంచి 3 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. ఈ సిక్స్ ఫోర్లతో రజత్ కేవలం 68 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో రంజీ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

2 / 5
రంజీ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉంది. 2016లో ఢిల్లీ తరపున ఆడిన పంత్ జార్ఖండ్‌పై కేవలం 48 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రంజీ టోర్నీ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.

3 / 5
2023లో ఛత్తీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో అస్సాం తరపున సంచలనం సృష్టించిన రియాన్ పరాగ్ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రంజీ టోర్నీలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ.

4 / 5
ఇప్పుడు ఈ జాబితాలో రజత్ పటీదార్ కేవలం 68 బంతుల్లోనే సెంచరీ సాధించి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో మధ్యప్రదేశ్‌ తరపున రంజీ టోర్నీలో వేగవంతమైన సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

5 / 5
Follow us