Video: 2 గ్రూపులుగా ఆసీస్ బయలుదేరిన పాక్ జట్టు.. మరోసారి బయటపడిన విభేదాలు?
Pakistan Team reached Melbourne: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మెల్‌బోర్న్ చేరుకున్నాడు. అతనితో పాటు షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా కూడా మెల్‌బోర్న్ చేరుకున్నారు. కానీ, ఈ టీంలో కొత్త కెప్టెన్ రిజ్వాన్‌తో సహా చాలా మంది ఇతర ఆటగాళ్లు కనిపించలేదు.
Pakistan Team reached Melbourne: పాకిస్థాన్ జట్టులో అంతా సవ్యంగా సాగుతున్నట్లుగా లేదు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మధ్య స్నేహం చెడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు, వీడియోలు చూస్తే, ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఏదైనా జట్టు కలిసి పర్యటన కోసం బయలుదేరుతుంది. కానీ, పాక్ జట్టులో ఇది కనిపించలేదు. ఆస్ట్రేలియా పర్యటన కోసం, జట్టు కలిసి వెళ్లలేదు. రెండు భాగాలుగా వెళ్లడం గమనార్హం. బాబర్ ఆజంతో మెల్బోర్న్ చేరుకున్న పాక్ జట్టులో కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, ఇతర ఆటగాళ్లు కనిపించలేదు.
పీసీబీ షేర్ చేసిన ఫొటోలతో అసలు విషయం బయటకు..
మొహమ్మద్ రిజ్వాన్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు అక్టోబర్ 29న మెల్‌బోర్న్‌కు బయలుదేరనున్నట్లు వార్తలు వచ్చాయి. మెల్‌బోర్న్‌కు బాబర్ అజామ్ రాక గురించి సమాచారం ఇస్తూ ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ తెలియజేసింది.
ఏ ఆటగాళ్లతో బాబర్ ఆజం వెళ్లాడంటే..
📸 Members of the Pakistan ODI squad for the Australia series arrive in Melbourne 🛬
The remaining ODI players will depart for Melbourne today 🏏#AUSvPAK pic.twitter.com/K5Q3cXYn3d
— Pakistan Cricket (@TheRealPCB) October 29, 2024
బాబర్ అజామ్‌తో పాటు మెల్‌బోర్న్ చేరుకున్న ఆటగాళ్లలో షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, ఫైజల్ అక్రమ్ ఉన్నారని పాకిస్థాన్ క్రికెట్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు చూపిస్తున్నాయి. వీరితో పాటు మిగతా ఆటగాళ్లు అక్టోబర్ 29న రిజ్వాన్‌తో కలిసి ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నారు.
ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ పర్యటన..
View this post on Instagram
ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. నవంబర్ 4 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. చివరి వన్డే నవంబర్ 10న జరగనుంది. నవంబర్ 14 నుంచి 18 వరకు టీ20 సిరీస్ జరగనుంది.
కొత్త కెప్టెన్, కొత్త వైట్ బాల్ కోచ్, ఆస్ట్రేలియా పర్యటన..
ఈ పర్యటనకు ముందు పాకిస్థాన్ క్రికెట్‌లో మరిన్ని ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన ఒక రోజు తర్వాత వైట్ బాల్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేశారు. పీసీబీ వైట్ బాల్ జట్టుకు కొత్త కోచ్‌గా జాసన్ గిల్లెస్పీని కూడా నియమించింది. ఆస్ట్రేలియా పర్యటనలో సెలెక్టర్ అసద్ షఫీక్ కూడా జట్టుతో ఉంటాడు. అతను ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించడంలో కెప్టెన్, కోచ్‌కు మద్దతు ఇస్తాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..