AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్జరీ సక్సెస్!.. బట్ టీమ్‌లోకి వచ్చేదెప్పడు?

టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నుంచి వైదొలిగిన కొద్ది రోజులకే టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇండియా ఫస్ట్ ఛాయిస్ ఆల్ రౌండర్‌ హార్ధిక్ పాండ్యా వెన్ను గాయంతో సుమారు ఐదు నెలలు పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. గత సెప్టెంబర్‌లో దుబాయి వేదికగా జరిగిన ఆసియా కప్‌లో తొలిసారి వెన్నునొప్పికి గురైన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత పలు సిరిస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. […]

సర్జరీ సక్సెస్!.. బట్ టీమ్‌లోకి వచ్చేదెప్పడు?
Ram Naramaneni
|

Updated on: Oct 05, 2019 | 12:46 PM

Share

టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నుంచి వైదొలిగిన కొద్ది రోజులకే టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇండియా ఫస్ట్ ఛాయిస్ ఆల్ రౌండర్‌ హార్ధిక్ పాండ్యా వెన్ను గాయంతో సుమారు ఐదు నెలలు పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. గత సెప్టెంబర్‌లో దుబాయి వేదికగా జరిగిన ఆసియా కప్‌లో తొలిసారి వెన్నునొప్పికి గురైన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత పలు సిరిస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్‌ ఆడుతుండగా హార్దిక్‌ వెన్ను గాయంతో బాధపడ్డాడు. నొప్పి భరించలేక నేలపై విలవిల్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా, పాండ్యా వెన్నుపూస కింది భాగంలో గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతడు లండన్‌‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.

బెంగళూరు, మొహాలీ జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న హార్దిక్‌.. అటు తర్వాత లండన్‌కు వెళ్లాడు. తన సర్జరీ విజయవంతంగా పూర్తైన విషయాన్ని హార్దిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పేర్కొన్నాడు. ‘ నా సర్జరీ సక్సెస్‌ అయ్యింది. నేను తేరుకోవాలని ఆశించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నేను తిరిగి జట్టుతో కలుస్తా.. కానీ సమయం తెలియదు. అప్పటివరకూ నన్ను మిస్‌ అవుతారు’ అంటూ హార్దిక్‌ పేర్కొన్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌లో పూర్తిస్థాయిలో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఆడిన హార్దిక్‌.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దాంతో సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో లండన్‌ వెళ్లాడు. గతేడాది ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తుది పోరులో హార్దిక్‌ను తొలిసారి వెన్నునొప్పి గాయం వేధించింది. ఆ తర్వాత తేరుకున్నప్పటికీ తరుచు ఈ గాయం వేధించడంతో కొన్ని సిరీస్‌లు మిస్‌ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లకు గాయం వేధించిన కారణంగానే హార్దిక్‌ దూరం కాగా, వెస్టిండీస్‌ పర్యటనలో కూడా పాల్గొనలేదు.

Follow Us
12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త..
12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త..
ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా?
ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా?
గురు చంద్రుల అనుబంధం.. ఆ రాశుల వారికి కనక వర్షం
గురు చంద్రుల అనుబంధం.. ఆ రాశుల వారికి కనక వర్షం
ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టేశారా.. అంత స్పెషల్ మరి
ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టేశారా.. అంత స్పెషల్ మరి
కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే..
కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే..
ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు
ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. 'టాక్సిక్‌'పై హీరోయిన్ విమర్శలు
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. 'టాక్సిక్‌'పై హీరోయిన్ విమర్శలు
టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పీడ్‌స్టర్
టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పీడ్‌స్టర్
వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి? అద్భుతమైన ఆరోగ్యం
వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి? అద్భుతమైన ఆరోగ్యం
వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ కీలక నిర్ణయం..!
వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ కీలక నిర్ణయం..!