AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం.. అర్జెంటీనా ఎంట్రీతో నెటిజన్లు షాక్..!

FIFA World Cup 2026 Prediction: అంచనాలు, గణాంకాలు ఎలా ఉన్నా ఫుట్‌బాల్ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం అసాధ్యం. స్పెయిన్ జట్టు ఈ ఐదేళ్ల క్రితం నాటి జోస్యాన్ని తిప్పికొడుతుందా, లేక ఆ నెటిజన్ చెప్పినట్లే అర్జెంటీనా ఫైనల్‌ విజేతగా నిలబడుతుందా అనేది నేటి రాత్రి జరిగే మహా సంగ్రామంలో తేలిపోనుంది.

5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం.. అర్జెంటీనా ఎంట్రీతో నెటిజన్లు షాక్..!
Fifa World Cup 2026 Prediction
Venkata Chari
|

Updated on: Jul 16, 2026 | 9:46 AM

Share

FIFA World Cup 2026 Prediction: ఫుట్‌బాల్ ప్రపంచకప్ తుది సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో ఒక పాత పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఐదేళ్ల క్రితం, అంటే కనీసం లియోనెల్ మెస్సీ గత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడకముందే, 2026 ప్రపంచకప్ ఫైనల్‌లో ఏ జట్లు తలపడతాయి, స్కోరు ఎంత ఉంటుందో ఒక నెటిజన్ ఖచ్చితంగా ఊహించాడు. ఆ అంచనా ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు నోరెళ్లబెడుతున్నారు.

కాలజ్ఞానాన్ని మించిన వింత పోస్ట్.. నాడు నవ్వుకున్నారు..!

ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) వేదికగా ‘డిలెమ్మా’ అనే పేరున్న ఒక ఖాతాదారుడు 2021 జూలై 12న ఒక పోస్ట్ చేశాడు. అది ఏదో ఊహించి రాసినట్లు కాకుండా, అప్పటికే జరిగిపోయిన సంఘటనను వివరిస్తున్నట్లుగా ఉంది. “2026 ప్రపంచకప్ ఫైనల్‌లో స్పెయిన్ జట్టును అర్జెంటీనా మూడు-రెండు తేడాతో ఓడించింది” అనేది ఆ పోస్ట్ సారాంశం. నాడు ఎవరో పిచ్చివాడు చేసిన పోస్ట్‌గా కొట్టిపారేసిన నెటిజన్లు, ఇప్పుడు అందులోని నిజాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే స్పెయిన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లడం, నేడు జరగబోయే సెమీఫైనల్‌లో అర్జెంటీనా బరిలోకి దిగుతుండటంతో ఈ పాత పోస్ట్ కాస్తా దావానంలా వ్యాపించింది. దాదాపు లక్షన్నరకు పైగా లైకులు, వేలాది రీట్వీట్లతో ఇది సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

‘నువ్వు దేవుడివా.. లేక ఫిఫా గుట్టు తెలిసిన వాడివా?’

ఈ వింత జోస్యం చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నువ్వేమన్నా భవిష్యత్తు నుంచి వచ్చావా? కాస్త వచ్చే వారం లాటరీ నంబర్లు కూడా చెప్పరాదా” అని ఒకరు సరదాగా వ్యాఖ్యానించగా, “ఈ మ్యాచ్‌ల కథ ముందే రాసిపెట్టి ఉందా? నువ్వు ఫిఫా రహస్య గదిలో పనిచేస్తున్నావా” అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఖాతాదారుడు గత ఆరు నెలలుగా కనీసం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా కూడా లేకపోవడం విశేషం. స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్ ఓడిపోయిన తర్వాత ఈ పోస్ట్ వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒకవేళ ఈ అంచనా వంద శాతం నిజమైతే, ప్రపంచకప్ మొత్తం ముందుగానే కుమ్మక్కై జరిగిందని నమ్మాల్సి వస్తుందని కొందరు వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లాండ్ సమరం.. విశ్లేషకులు ఏమంటున్నారు?

ఈ జోస్యం నిజం అయ్యేలా ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ పోరులో మెస్సీ సేన ఇంగ్లాండ్‌ను ఓడించి, ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటినా టీం 1-2 తేడాతో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. దీంతో ఫైనల్ పోరులో ఇక స్పెయిన్‌తో పోరాడేందుకు సిద్ధమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us