AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్, కోహ్లీ ఇన్.. వాళ్లకు మాత్రం మొండిచేయి.. వరల్డ్ కప్ 2027కు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్..?

2027 వన్డే వరల్డ్ కప్‌కు అధికారిక షెడ్యూల్ విడుదలైన వేళ టీమిండియా (Team India) కూర్పుపై చర్చ మొదలైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే టోర్నీ కోసం సమతూకమైన 15 మంది బృందాన్ని సిద్ధం చేసే దిశగా ఎంపికపై అంచనాలు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉండే అవకాశం కనిపిస్తోంది.

రోహిత్, కోహ్లీ ఇన్.. వాళ్లకు మాత్రం మొండిచేయి.. వరల్డ్ కప్ 2027కు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్..?
World Cup 2027
Venkata Chari
|

Updated on: Oct 04, 2026 | 1:35 PM

Share

2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎలా ఉండబోతుందనే దానిపై అంచనాలు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించే ఈ టోర్నీకి సంబంధించి అధికారిక షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఫ్రికా పిచ్‌లపై ఉండే వేగం, బౌన్స్‌ను దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్, పేస్, ఆల్‌రౌండర్లకు సమాన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వన్డే ఫార్మాట్‌లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అతడితో కలిసి రోహిత్ శర్మ (Rohit Sharma) ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. కొత్త బంతిని ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేయగల రోహిత్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది.

మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul), రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రాహుల్ బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా తీసుకునే ప్రధాన ఎంపికగా కనిపిస్తున్నాడు. బ్యాకప్ కీపర్, ఫినిషర్ పాత్ర కోసం ఇషాన్ కిషన్ (Ishan Kishan), ధ్రువ్ జురెల్ (Dhruv Jurel)లో ఒకరికి అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: ఈ జట్టుతో వన్డే వరల్డ్ కప్‌నకు పోతే పరువుపోద్ది.. ఈ ఇద్దరిని తప్పించి, ఆ ఇద్దర్ని పిలవండి..!

ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కీలకంగా ఉండే అవకాశం ఉంది. అతడికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) వంటి సీమ్ ఆల్‌రౌండర్‌ను తీసుకునే అవకాశం ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ విభాగంలో అక్షర్ పటేల్ (Axar Patel), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ బ్యాటింగ్‌లోనూ ఉపయోగపడగలగడం జట్టు కూర్పుకు అదనపు బలం కావొచ్చు.

పేస్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) నాయకత్వం వహించే అవకాశం ఉంది. మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj), ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) లేదా హర్షిత్ రాణా (Harshit Rana)లో ఒకరికి చోటు దక్కొచ్చని అంచనా. ఎడమచేతి పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) జట్టులో వైవిధ్యం తీసుకురాగలడు. డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ ఉపయోగపడుతుందని సోర్స్ పేర్కొంటోంది.

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)కు చోటు దాదాపు ఖాయంగా భావిస్తున్నారు. మిడిల్ ఓవర్లలో అతడి బౌలింగ్ కీలకంగా మారొచ్చని అంచనా.

ఎక్కువమంది చదివినది: 351 పరుగులు చేసినా ఓటమి.. ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచిదా..?

అంచనాల ప్రకారం 15 మంది జాబితాలో గిల్, రోహిత్, కోహ్లీ, రాహుల్, ఈషాన్ కిషన్, ధ్రువ్ జురెల్, హార్దిక్, నీతీష్, అక్షర్, జడేజా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ ఉన్నారు. ఇది అధికారిక జట్టు ప్రకటన కాదు. ప్రస్తుత అంచనాగా మాత్రమే చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us