AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhogi Movie: ఇక కోత నాది లెక్క మీది.. అద్దిరిపోయిన ‘భోగి’ టీజర్.. శర్వానంద్‌ను ఇలా ఎప్పుడు చూసి ఉండరు

ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు శర్వానంద్. సంక్రాంతికి నారీ నారీ నడుము మురారి సినిమాతో నవ్వించిన శర్వా ఆ తర్వాత బైకర్ మూవీతో ఎమోషనల్ గానూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'భోగి' అంటూ ఈ ఏడాది ముచ్చటగా మూడో సినిమాతో మన ముందుకు రానున్నాడు శర్వా.

Bhogi Movie: ఇక కోత నాది లెక్క మీది.. అద్దిరిపోయిన 'భోగి' టీజర్.. శర్వానంద్‌ను ఇలా ఎప్పుడు చూసి ఉండరు
Bhogi Movie Teaser
Basha Shek
|

Updated on: Oct 04, 2026 | 1:46 PM

Share

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌లోని విజువల్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. 1960ల నాటి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శర్వానంద్ ‘గంగ’ అనే ఊరమాస్ అండ్ రగ్డ్ లుక్‌లో ఇంటెన్స్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన తెలంగాణ స్లాంగ్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్ర టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ భోగి సినిమాను నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అంశాలతో వస్తున్న ఈ చిత్రంపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది.

1960ల నాటి ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ‘భోగి’ సినిమా స్టోరీ సాగనున్నట్లు టీజర్ ను బట్టి తెలుస్తోంది. చెడు, అహింస, బానిసత్వంపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ డిఫరెంట్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘బొగ్గుల గుట్ట’ అనే ఊరిలో గ్రామస్థులు దొరల పాలనలో ఉంటారు. వారి కింద బానిసలుగా దొరికిన పని చేస్తూ బతుకుతుంటారు. మరి అలాంటి సామాన్యుల నుంచి దొరలను ఎదిరించే ఓ వ్యక్తి పుట్టుకొస్తాడు. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి తమ హక్కులను ఎలా సాధించుకున్నాడు? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్..

శర్వానంద్ భోగి సినిమా టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us