AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suresh : 116 కేజీల నుంచి 33 కేజీలకు వచ్చా.. డైట్ సీక్రెట్ చెప్పిన సీనియర్ నటుడు సురేష్..

సీనియర్ నటుడు సురేష్ 59 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు. 116 కేజీల నుంచి 87 కేజీలకు బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్నారు. గ్రీన్ టీ, ఉడికించిన కూరగాయలు, గ్రిల్డ్ ఆహారం, 16 గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి నియమాలను పాటిస్తూ, సిక్స్ ప్యాక్ కంటే ఫ్లాట్ స్టమక్, ఆరోగ్యం ముఖ్యమని ఆయన చెప్పారు.

Rajitha Chanti
|

Updated on: Oct 04, 2026 | 1:16 PM

Share
సీనియర్ నటుడు సురేష్ ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఆయన, ఒకప్పుడు నటి విజయశాంతితో పదేళ్ల పాటు మాట్లాడని విషయాన్ని వెల్లడించారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ సమయంలో ఊటీలో అనుకోకుండా మళ్ళీ కలుసుకున్న తర్వాతే వారి మధ్య సఖ్యత ఏర్పడిందని తెలిపారు.

1 / 5
ఆ రోజుల్లో విజయశాంతి ‘లేడీ సూపర్ స్టార్’గా ఎదిగిన తర్వాత ఆమె సినిమాలలో చిన్న పాత్రలు చేయటం తనకు ఇష్టం లేదని, విజయశాంతితో కలిసి సినిమా చేయాలనుకున్నానే తప్ప, ఆమె సినిమాలో తాను ఉండాలనుకోలేదని స్పష్టం చేశారు. చిరంజీవి, రాధికల విషయంలోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయని గుర్తు చేశారు. ఆరు నెలల క్రితం తనకు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనిపించిందని అన్నారు.

2 / 5
ఉదయం: చాలా నీరు, గ్రీన్ టీతో రోజును ప్రారంభిస్తారు. వ్యాయామానికి ముందు ఆపిల్, ఆరెంజ్, పైనాపిల్ వంటి తక్కువ చక్కెర గల పండ్లను తీసుకుంటారు. పీచెస్, ప్లమ్స్ వంటి అధిక చక్కెర పండ్లను నివారించాలని సూచించారు. వ్యాయామం: కార్డియోతో మొదలుపెట్టి, తర్వాత వెయిట్ ట్రైనింగ్ చేస్తారు. అల్పాహారం: కార్డియో, వెయిట్ ట్రైనింగ్ మధ్యలో గుడ్డులోని తెల్లసొన, ఉడికించిన కూరగాయలు, అప్పుడప్పుడు గ్రిల్డ్ చేపలు తీసుకుంటారు.

3 / 5
మధ్యాహ్నం: బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మధ్యలో సుదీర్ఘ విరామం ఉంటుంది. ఈ సమయంలో వెయిట్ ట్రైనింగ్, కాలిస్తెనిక్స్, స్ట్రెచింగ్, యోగా, ఆబ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. భోజనం: పుల్కాలు, గ్రిల్డ్ చికెన్/ఫిష్/రొయ్యలు, ఒక పెద్ద కప్పు పప్పును తింటారు. అన్నాన్ని సాధ్యమైనంత వరకు నివారించి, ఆదివారం మాత్రమే ఫ్రైడ్ రైస్ లేదా బిర్యానీ వంటివి తింటారు. మాంసాహారం: మటన్‌ను నివారించి, చికెన్, ఫిష్, అప్పుడప్పుడు రొయ్యలను ఇష్టపడతారు.

4 / 5
రాత్రి భోజనం:  రాత్రి భోజనం పూర్తిగా మానేసి, 16 గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తారు. ఇది బరువు తగ్గడానికి చాలా సహాయపడిందని, 116 కేజీల నుంచి 87 కేజీలకు బరువు తగ్గారని, 83 కేజీలు తన లక్ష్యమని తెలిపారు. సురేష్ తన ఫ్లాట్ స్టమక్ గురించి చెబుతూ, సిక్స్ ప్యాక్ కోసం తాను ప్రయత్నించడం లేదని, ఎందుకంటే అది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిది కాదని స్పష్టం చేశారు. సిక్స్ ప్యాక్ కోసం తీవ్రమైన వ్యాయామం, క్యాలరీ, నీటి లోటుతో కూడిన ఆహారం అవసరమని, ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, కార్డియాక్ అరెస్ట్‌లకు కూడా దారితీసే అవకాశం ఉందని ఆయన వివరించారు.

5 / 5
Follow Us