AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: గవర్నర్ కోటాపై కాంగ్రెస్ నేతల నజర్.. ఎమ్మెల్సీ రేసులో ఉన్నది వీరేనట..!

తెలంగాణలో మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు పార్టీ పెద్దలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ నేతలను కలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తుండగా, రెండు స్థానాలను బీసీలకు కేటాయించే అంశంపై చర్చ సాగుతోంది. పద్మశాలి, ముదిరాజు సామాజికవర్గాల నేతల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Telangana Congress: గవర్నర్ కోటాపై కాంగ్రెస్ నేతల నజర్.. ఎమ్మెల్సీ రేసులో ఉన్నది వీరేనట..!
Telangana Congress
Prabhakar M
| Edited By: |

Updated on: Oct 04, 2026 | 1:56 PM

Share

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా మారింది. మూడు స్థానాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడకముందే ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీ ముఖ్య నేతలతో పాటు ఢిల్లీ స్థాయిలోనూ లాబీయింగ్ మొదలైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలువురు నేతలు ఇప్పటికే.. సీఎం రేవంత్ రెడ్డి అపాయిట్‌మెంట్ కోరినట్లు ప్రచారం.. అంతేకాకుండా.. పీసీసీ అధ్యక్షుడితో కూడా సమావేశం అవుతున్నారని పేర్కొంటున్నారు. అయితే.. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు తమకు అవకాశం దక్కేలా పార్టీ పెద్దలను కలుస్తున్నట్లు సమాచారం

ఈసారి ఎమ్మెల్సీ ఎంపికలో సామాజికవర్గాల సమీకరణలు కీలకంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డి సామాజికవర్గానికి కేటాయించిన నేపథ్యంలో.. గవర్నర్ కోటాలో బీసీ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది

రెండు స్థానాలు బీసీలకు

మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీసీ సామాజికవర్గాలకు కేటాయించే అంశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలతో పాటు పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే నేతలను ఎంపిక చేయాలనే ఆలోచనలో నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

పద్మశాలి కోటాపై సిరిసిల్ల సభలోనే హామీ

పద్మశాలి సామాజికవర్గానికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించే అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో కీలక ప్రకటన చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పెద్దల సభకు పంపుతామని సిరిసిల్ల సభ వేదికగా సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఆ సామాజికవర్గానికి దక్కే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది. పద్మశాలి కోటాలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పున్న కైలాష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం హామీ నేపథ్యంలో ఈ ఇద్దరి పేర్లపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది

ముదిరాజు కోటాలో ఎమ్మెల్సీ పదవి..

మరో ఎమ్మెల్సీ స్థానాన్ని ముదిరాజు సామాజికవర్గానికి కేటాయించే అంశాన్ని కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ముదిరాజు సామాజికవర్గం గణనీయమైన జనాభాను కలిగి ఉండటంతో ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ముదిరాజు కోటాలో మెదక్ ఎంపీ అభ్యర్థి గా పోటీ చేసిన నీలం మధు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ముఖ్య నేతలను కలిసి ఎమ్మెల్సీ అవకాశం కోసం తన ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఎంపీ ఎన్నికల తర్వాతా నీలం మధుకు సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీఠ వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది కనుక వర్కౌట్ అవుతుందా లేదా చూడాల్సి ఉంది.

బీసీ కోటాలో పలువురి పేర్లు

బీసీ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చనగాని దయాకర్, సత్తు మల్లేశ్, కౌశిక్ యాదవ్ పేర్లు కూడా పార్టీలో చర్చకు వస్తున్నట్లు సమాచారం..

మూడో సీటుపై ఆసక్తికర సమీకరణం..

మూడు స్థానాల్లో మూడో సీటును రెడ్డి సామాజికవర్గానికి కేటాయించే పరిస్థితి వస్తే ఆర్టీఐ కమిషనర్ అయోధ్యారెడ్డి పేరు కూడా రేసులోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

మొత్తంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తోంది. సామాజికవర్గాల ప్రాతినిధ్యం, పార్టీ విధేయత, రాజకీయ సమీకరణాలు.. ఈ అంశాల ఆధారంగా తుది ఎంపిక ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆశావహుల జాబితాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Follow Us
భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత
భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత
Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్
Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ నేతల నజర్.. రేసులో ఉన్నది వీరేనా..?
ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ నేతల నజర్.. రేసులో ఉన్నది వీరేనా..?
బాబా వంగా జ్యోతిష్యం.. 2027లో తలరాత మారిపోయే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. 2027లో తలరాత మారిపోయే రాశులివే!