గవాస్కర్‌కు మంజ్రేకర్ పంచ్!

ప్రపంచకప్‌లో భారత్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు వన్డే, టీ20లకు సారధ్య బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు చర్చించారు. ఇది ఇలా ఉండగా కోహ్లీనే కెప్టెన్‌గా మళ్ళీ సెలెక్టర్లు ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ సునీల్ గవాస్కర్ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ.. […]

  • Ravi Kiran
  • Publish Date - 12:58 am, Thu, 1 August 19
గవాస్కర్‌కు మంజ్రేకర్ పంచ్!

ప్రపంచకప్‌లో భారత్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు వన్డే, టీ20లకు సారధ్య బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు చర్చించారు. ఇది ఇలా ఉండగా కోహ్లీనే కెప్టెన్‌గా మళ్ళీ సెలెక్టర్లు ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ సునీల్ గవాస్కర్ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ.. ‘గవాస్కర్ నిర్ణయాన్ని గౌరవంగా వ్యతిరేకిస్తున్నానంటూ పంచ్ ఇచ్చాడు. ప్రపంచకప్‌లో భారత్ జట్టు ప్రదర్శన నామమాత్రం కాదన్నారు. టోర్నీలో 9 మ్యాచులు ఆడి ఏడింట్లో గెలిచి.. రెండింట్లో ఓడింది. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా జట్టు ఎంపికలో నాణ్యతకి అనుభవంతో పనిలేదని చెప్పుకొచ్చాడు.