IPL 2025: మే 24న ఇంగ్లాండ్ తో రచ్చ రచ్చ.. కట్ చేస్తే.. మర్నాడే RCB బలగంలో చేరిన జింబాబ్వే స్టార్ బౌలర్!
జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టులో చేరాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ తర్వాత మర్నాడే RCB శిబిరంలో పాల్గొన్నాడు. లుంగీ ఎంగిడి స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేయడం కోసం ముజారబానీని ఎంపిక చేశారు. ప్లేఆఫ్స్‌కు ముందు అతని వేగం, అనుభవం ఆర్సీబీ బౌలింగ్‌ను మరింత బలోపేతం చేయనుంది. ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే RCBతో పాటు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కూడా చేరగా, RCB ఇప్పుడు ముజారబానీ చేరికతో తమ బౌలింగ్ దళానికి మరింత బలాన్ని అందించి, టైటిల్ గెలవడానికి తుది దశలో పుష్ ఇవ్వాలని చూస్తోంది.

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శిబిరానికి శుభవార్త దక్కింది. జింబాబ్వేకు చెందిన స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ జట్టులో చేరి బౌలింగ్ దళానికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ, తమ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయినప్పటికీ, టోర్నమెంట్‌లో అగ్రస్థానాల్లో నిలిచే అవకాశాలను పూర్తిగా కోల్పోలేదు. అయితే టాప్-2లో ఉంటే రెండు అవకాశాలు లభించేవి కాబట్టి, ఆ ఓటమి కొంత వెనుకడుగు వేసినట్లయింది.
సోమవారం ఉదయం, ఆర్సీబీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో బ్లెస్సింగ్ ముజారబానీ జట్టులో చేరిన విషయాన్ని తెలియజేస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది. “బ్లెస్సింగ్ ముజారబానీ IPL 2025 కోసం RCBలో చేరారు. మే 24న ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక టెస్ట్‌లో పాల్గొన్న ఆయన, మే 25న RCB శిబిరంలో చేరారు” అని ప్రకటన చేసింది. జింబాబ్వే తరపున ఆడే ఈ పొడవైన పేసర్‌ను ఆర్సీబీ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ముజారబానీ ఇప్పటివరకు 70 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 78 వికెట్లు తీసి తన స్థాయిని నిరూపించుకున్నాడు. అంతేకాకుండా, అతను 13 టెస్ట్‌లు, 55 వన్డేలు కూడా జింబాబ్వే తరపున ఆడాడు.
ఆర్సీబీలో చేరడానికి ముందు, ముజారబానీ ఇంగ్లాండ్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై జింబాబ్వే 22 ఏళ్ల తర్వాత ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ కావడంతో, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముఖ్యంగా, దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేయడానికి ముజారబానీ ఆర్సీబీలో చేరుతున్నాడు. ఎంగిడి జూన్ 11న లార్డ్స్‌లో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో చేరేందుకు మే 26న బయలుదేరనున్నాడు. ఈ నేపథ్యంలో, ఆర్సీబీ తన బౌలింగ్ దళాన్ని బలోపేతం చేసేందుకు ముజారబానీని రప్పించుకుంది.
ఇప్పటి వరకు ముజారబానీ ఐపీఎల్‌లో అడుగుపెట్టలేదు. అతనికి ఇలాంటి పెద్ద లీగ్‌లలో అనుభవం తక్కువే అయినప్పటికీ, అతని వేగం, శక్తి, అంతర్జాతీయ అనుభవం కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్‌లలో ఉపయోగపడతాయని ఆర్సీబీ నమ్మకంగా ఉంది. ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే RCBతో పాటు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కూడా చేరగా, RCB ఇప్పుడు ముజారబానీ చేరికతో తమ బౌలింగ్ దళానికి మరింత బలాన్ని అందించి, టైటిల్ గెలవడానికి తుది దశలో పుష్ ఇవ్వాలని చూస్తోంది.
24th May – Part of a historic Test for Zimbabwe 🙌
25th May – Joins the RCB Camp 🥶
𝑴𝒖𝒛𝒂𝒓𝒂𝒃𝒂𝒏𝒊 is 𝑩𝒍𝒆𝒔𝒔𝒊𝒏𝒈 us with his presence. Happy #Homecoming, lad! 👊#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/SDypfORe4X
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 26, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..