AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCIని ఎదిరించి.. బొక్కబోర్లా పడ్డారు! KKR, SRH టీమ్స్‌ తప్పు తెలుసుకుంటాయా..?

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్ల విజయవంతమైన వ్యూహాలను పరిశీలిస్తే.. ముఖ్యంగా, ఐపీఎల్ మెగా వేలం ముందు జరిగిన రిటెన్షన్ విధానాలపై చర్చలు, వాటి ప్రభావం, వివిధ జట్లు ఎంచుకున్న విభిన్న వ్యూహాలను పరిశీలిస్తుంది. కొన్ని జట్లు కోర్ ప్లేయర్లను కాపాడుకోవడానికి ఎక్కువ రిటెన్షన్స్‌కు ప్రయత్నించగా, మరికొన్ని జట్లు వేలంలో దూకుడుగా వ్యవహరించాయి.

BCCIని ఎదిరించి.. బొక్కబోర్లా పడ్డారు! KKR, SRH టీమ్స్‌ తప్పు తెలుసుకుంటాయా..?
Srk And Kavya
SN Pasha
|

Updated on: May 26, 2025 | 6:17 PM

Share

ఐపీఎల్‌ 2025 ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు లీగ్‌ మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్‌లో మూడు, ఫైనల్‌ మ్యాచ్‌తో కలుపుకొని మొత్తంగా మరో 6 మ్యాచ్‌లు పూర్తి అయిపోతే.. ఐపీఎల్‌ 18 సీజన్‌ ఎండ్‌ అవుతుంది. గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ జట్లు ఈ సారి ఫ్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. మరి ఈ నాలుగు టీమ్స్‌లో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయం పక్కనపెడితే.. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభానికి ముందు జరిగిన హడావిడి గురించి కాస్త మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు బీసీసీఐ.. ఐపీఎల్‌లోని పది జట్ల యజమానులతో ఓ మీటింగ్‌ పెట్టింది. రిటెన్షన్ష్ విధివిధానాలపై చర్చించేందుకు వారి పిలిచింది. ఆ మీటింగ్‌ కంటే ముందు, తర్వాత రచ్చ అంతా ఇంతా కాదు. కొన్ని టీమ్స్‌ రిటెన్షన్స్ లిమిట్‌ పెంచాలని పట్టుబట్టాయి. చాలా టీమ్స్‌ ఎక్కువమంది ప్లేయర్ల రిటెన్షన్స్‌కు ఒప్పుకోలేదు.

ఐపీఎల్‌ 2024లో ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్స్‌ అయితే కచ్చితంగా 6 నుంచి 8 మంది ప్లేయర్లను రిటెన్‌ చేసుకునేందుకు అనుమతించాలని గట్టిగా పట్టుబట్టాయి. వీరితో పాటు సీఎస్‌కే, ముంబై, రాజస్థాన్‌ జట్లు కూడా ఎక్కువ మంది ప్లేయర్లను రిటెన్‌ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే.. వీళ్ల టీమ్స్‌లో అప్పటి ఉన్న ప్లేయర్లు బాగా ఆడుతున్నారు.. టీమ్‌ స్ట్రాంగ్‌గా ఉంది, మళ్లీ కేవలం ముగ్గుర్ని మాత్రమే రిటెన్‌ చేసుకొని.. అందర్ని రిలీజ్‌ చేస్తే.. టీమ్‌ కాంబినేషన్‌ దెబ్బతింటుంది.. టీమ్‌ మళ్లీ సెట్‌ అవుతుందో కాదో.. అని భయపడి.. కోర్‌ టీమ్‌ను కాపాడుకోవడానికి ఎక్కువమంది ప్లేయర్లలు రిటెన్‌ చేసుకోవాలని భావించాయి. అందుకోసం బీసీసీఐ తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. కానీ మరోవైపు.. పంజాబ్‌ కింగ్స్‌, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ లాంటి టీమ్స్‌ ఏమో.. ఎక్కువ మంది ప్లేయర్లు ఆక్షన్‌లో ఉండాలని భావించాయి.

వారిలోంచి తమకు కావాల్సిన వారిని పిక్‌ చేసుకోవాలి అంటే.. రిటెన్షన్స్‌ తక్కువ ఉండాలనేది వారి వాదన. ఈ విషయంలో కేకేఆర్‌ ఓనర్‌ షారుఖ్‌ ఖాన్‌కు, పంజాబ్‌ కింగ్స్‌ ఓనర్‌ నెస్‌ వాడియాకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాడియాపై షారుఖ్‌ చేయి కూడా చేసుకున్నాడనే వార్త ఈ సీజన్‌ కంటే ముందు తీవ్ర దుమారం రేపింది. ఫైనల్‌గా.. బీసీసీఐ కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ వైపే మొగ్గుచూపుతూ.. ఏకంగా ఆరుగురు ప్లేయర్లను రిటెన్‌ చేసుకోవచ్చని రూల్‌ తెచ్చింది. ఈ రూల్‌తో కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, ఎంఐ, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫుల్‌ ఖుష్‌ అయ్యాయి. కేకేఆర్‌, ఆర్‌ఆర్‌ ఆరుకు ఆరు రిటెన్షన్స్‌ చేసుకోగా.. ఎస్‌ఆర్‌హెచ్‌, ఎంఐ ఐదేసి ప్లేయర్లలను రిటెన్‌ చేసుకున్నాయి. అయితే.. అందుకోసం ఆ జట్లు భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అదే వేరే విషయం అనుకోండి. కానీ, తాము అనుకున్నది సాధించాం.. తమ తమ కోర్‌ టీమ్స్‌ను కాపాడుకున్నాం.. ఇక వేలంలో కొంతమంది మామూలు ప్లేయర్లలను తీసుకుంటే సరిపోతుందిలే అని అనుకున్నారు.

అలాగే వేలంలో ఉన్న ప్లేయర్లకు సపోర్ట్‌గా పనికొచ్చే ప్లేయర్లను తీసుకున్నారనే తప్పా.. కోర్‌ను డిస్టబ్‌ చేస్తే ప్లేయర్లలను పెద్దగా తీసుకోలేదు. కానీ, పంజాబ్‌, ఆర్సీబీ లాంటి టీమ్స్‌ మాత్రం తక్కువ మందిని రిటెన్‌ చేసుకొని.. వేలంలో దూకుడుగా వ్యవహరించి మంచి ప్లేయర్లను పిక్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రిజల్ట్‌ కనిపిస్తుంది. కచ్చితంగా ఎక్కువ రిటెన్షన్స్‌ కావాల్సిందే అని.. బీసీసీఐతో పాటు మిగతా టీమ్స్‌తో ఫైట్‌ చేసిన కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రం ఈ సారి కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా వెళ్లలేకపోయాయి. ఈ సారి కూడా మాదే హవా అనుకున్న టీమ్స్‌ బొక్కబోర్లా పడ్డాయి. వారి వారి వైఫల్యానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పను కానీ.. ఇది కూడా ఒక కారణమే. వీరితో పాటు సీఎస్‌కే, డీసీ, లక్నో జట్లు కూడా ఐదేసి రిటెన్షన్స్‌ చేసుకున్నా.. వారి స్ట్రాటజీ వేరు. కానీ, కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రం.. 2024లో వారి టీమ్స్‌ ప్రదర్శన చూసి.. ఆ ప్లేయర్లే తమ టీమ్‌కు మూల స్థంబాలు అనుకొని.. ఎక్కువ రిటెన్షన్స్‌ కోసం పట్టుబట్టాయి. కానీ, వాళ్లు అనుకున్న ఫలితం మాత్రం సాధించలేకపోయాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!