బంగ్లా ఆటగాడి డ్యాన్స్.. కోపంతో రెచ్చిపోయిన జింబాబ్వే బౌలర్.. ఏం జరిగిందో తెలుసా?
జింబాబ్వే, బంగ్లాదేశ్ టీంల మధ్య జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్ రెండవ రోజు ఆటలో ఆటగాళ్ల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈమేరకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ZIM vs BAN: జింబాబ్వే టూర్ కు వచ్చిన బంగ్లాదేశ్ టీం.. ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీం బాగానే ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా టీం 468 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే టీం కూడా బాగానే ఆడుతోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే జట్టు వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. అయితే, రెండవ రోజు ఆటలో ఆటగాళ్ల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈమేరకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే క్రికెట్‌లో ఇలాంటి గొడవలు చాలానే చూస్తుంటాం కదా ఇందులో ఏముంది విశేషం అనుకుంటున్నారా.. అదే మీరు ఆ వీడియో చూడాల్సింది. అసలు విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాన్ టస్కిన్ అహ్మద్ తన కెరీర్‌లోనే మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. జింబాబ్వే బౌలర్లకు తలనొప్పిలా మారిన బంగ్లా బ్యాట్స్‌మెన్ పై జింబాబ్వే బౌలర్లు దాడికి దిగారు. 85వ ఓవర్‌లో వెలుగు చూసిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బంగ్లా బ్యాట్స్ మెన్ టాస్కిన్, జింబాబ్వే బౌలర్ ముజారబాని గొడవ పడ్డారు. 85 వ ఓవర్‌లో నాలుగవ బంతిని షార్ట్ బంతిగా వదిలాడు. దానిని టాస్కిన్ బాగానే ఎదుర్కొన్నాడు. అనంతరం చిన్న స్టెప్ వేశాడు. దీనిని తట్టుకోలేని జింబాబ్వే బౌలర్ ముజారబావి బంగ్లా బ్యాట్స్‌మెన్ చెంతకు చేరి మాటలతో దాడి చేసినట్లు కనిపించింది. ఇద్దరు మాటలతో రెచ్చిపోయారు. అయితే ఒకరి తలను మరొకరు రుద్దుకుంటూ నోటికి పనిచెప్పారు. కొద్దిసేపు వారి హావభావాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఒకరినొకరు మీదికి తోసుకుంటూ ఏదో తిట్టుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. దాంతో సోషల్ మీడియాలోనూ ఈ వీడియో బాగానే వైరల్ అవుతోంది.
టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టాస్కిన్ అహ్మద్ 75 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్‌లోనే అతిపెద్ద స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 7 టెస్టులు ఆడిన టాస్కిన్ కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. 10వ వికెట్ కు మహ్మదుల్లాతో కలిసి 191 పరుగులు జోడించాడు. మరోవైపు జింబాబ్వే బౌలర్ ముజారబాని తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
Now this is something!
Muzarabani and Taskin get into each other’s faces!
? Rabbitholebd #ZIMvBAN #BANvZIM #Cricket pic.twitter.com/mJmR8QfpFI
— Shihab Ahsan Khan (@shihabahsankhan) July 8, 2021
Also Read:
బిగ్ బాష్ లీగ్‌లో టీమిండియా ఉమెన్స్.. బంపర్ ఆఫర్లతో పోటీపడుతోన్న బీబీఎల్ టీంలు..!
IND vs SL: శ్రీలంక టీంలో కరోనా కలకలం.. కోచ్‌కి పాజిటివ్.. సందేహంలో వన్డే సిరీస్?