AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: వన్డేల్లో నేను, టీ20ల్లో నువ్వు.. ట్యాలెంట్ ఉన్నా బెంచ్‌కే రా తమ్ముడూ..!

Yashasvi Jaiswal and Vaibhav Sooryavanshi: భారత వన్డే జట్టులో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేరు ఉన్నా తుది జట్టులో చోటు మాత్రం దక్కడం లేదు. సీనియర్ ఓపెనర్ల మధ్య పోటీ కారణంగా ఈ యువ బ్యాటర్ ఎదురుచూడాల్సి వస్తోంది. ఇదే తరహా పరిస్థితిని టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కూడా ఎదుర్కొంటున్నాడు.

Team India: వన్డేల్లో నేను, టీ20ల్లో నువ్వు.. ట్యాలెంట్ ఉన్నా బెంచ్‌కే రా తమ్ముడూ..!
Yashasvi Jaiswal And Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: Sep 29, 2026 | 4:12 PM

Share

యశస్వి జైస్వాల్ భారత వన్డే జట్టులో ఉన్నప్పటికీ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రతిభ, ఫామ్ ఉన్నా తుది జట్టులో స్థానం దక్కడం సులభంగా మారలేదు. రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) వంటి ఓపెనర్ల కారణంగా అతడికి అవకాశం పరిమితమవుతోంది. ఇదే పరిస్థితి టీ20 క్రికెట్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఎదురవుతోంది. ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ఓపెనర్లుగా ఆడుతున్నారు. వయసు, ఫార్మాట్ వేర్వేరు అయినా జట్టులో చోటు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం ఒకేలా ఉంది. అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలని కోచింగ్ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటివరకు అవకాశం లభించిన సందర్భాల్లో యశస్వి తన బ్యాటింగ్‌తో ప్రభావం చూపిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ (Sitanshu Kotak) యశస్వి పరిస్థితిపై మాట్లాడాడు. జట్టులో స్థానాల కోసం తీవ్ర పోటీ ఉందని చెప్పాడు. యశస్వి అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని, అవకాశం వచ్చిన ప్రతిసారి బాగా ఆడాడని పేర్కొన్నాడు. అతడిపై ఎలాంటి అన్యాయం జరగడం లేదని స్పష్టం చేశాడు. కష్టపడి పనిచేస్తూ అవకాశం కోసం వేచి ఉండాలని సూచించాడు.

ఎక్కువమంది చదివినది: నా టార్గెట్ ఫిక్స్.. అందుకోసం అడ్డొచ్చినోళ్లను తొక్కి పడేసుడే.. విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి

యశస్వి గతంలో అఫ్గానిస్థాన్‌తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆడాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. ఇప్పుడు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటు దక్కింది. టెస్టు క్రికెట్‌లో తన స్థానాన్ని బలపర్చుకున్న ఈ ముంబై ఓపెనర్‌కు వన్డే ప్రపంచకప్ 2027లో అవకాశం ఎలా ఉంటుందనేది ఇప్పటికీ స్పష్టంగా లేదు.

ఇక వైభవ్ సూర్యవంశీ పరిస్థితి టీ20 ఫార్మాట్‌లో ఇలాగే ఉంది. అఫ్గానిస్థాన్‌తో స్వదేశీ టీ20 సిరీస్‌కు జట్టులో ఉన్నా తుది జట్టులో అవకాశం రాలేదు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అప్పట్లో వైభవ్‌కు ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడు తగినంత సమయం ఇస్తామని పేర్కొన్నాడు.

ఎక్కువమంది చదివినది: టాస్ కూడా పడకుండానే ముగిసిన మ్యాచ్.. నేరుగా సెమీస్‌లోకి భారత్

ప్రస్తుతం టీ20 జట్టులో సంజు శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మ (Abhishek Sharma) మొదటి ఎంపికలుగా ఉన్నారని గంభీర్ వివరించాడు. యశస్వి, వైభవ్ కథల్లో ఫార్మాట్ మారినా ఎదురుచూపు మాత్రం ఒకేలా కనిపిస్తోంది. ఇద్దరి ప్రతిభకు అవకాశాలు ఎప్పుడు పూర్తిస్థాయిలో దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us