AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: సచిన్, ధోనీ, కోహ్లీ..ముగ్గురిలో బెస్ట్ ఎవరు..? తేల్చేసిన మాజీ క్రికెటర్

Virat Kohli: సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలలో వన్డేల్లో ఎవరు అత్యుత్తమ బ్యాటర్ అనే చర్చపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. లక్ష్య ఛేదనలో కోహ్లీ అద్భుతమైన ఆటతీరు, నంబర్ 3లో నిలకడ, రికార్డులను ప్రస్తావిస్తూ అతడినే తన నంబర్ వన్ ఎంపికగా పేర్కొన్నారు. సిద్ధూ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల మధ్య కొత్త చర్చకు దారితీశాయి.

Virat Kohli: సచిన్, ధోనీ, కోహ్లీ..ముగ్గురిలో బెస్ట్ ఎవరు..? తేల్చేసిన మాజీ క్రికెటర్
Kohli (1)
Rakesh
|

Updated on: Sep 29, 2026 | 3:56 PM

Share

Virat Kohli: సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలలో వన్డేల్లో ఎవరు గొప్ప ఆటగాడు? ఈ ప్రశ్నపై క్రికెట్ అభిమానుల మధ్య ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ డిబేట్‌పై తన అభిప్రాయాన్ని చెప్పారు. వన్డే క్రికెట్‌లో కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడిగా తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియోలో సిద్ధూ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ లక్ష్య ఛేదనలో చూపించే నిలకడ, ఒత్తిడిని ఎదుర్కొనే విధానం అతడిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఛేజింగ్ సమయంలో కోహ్లీ ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడని గుర్తుచేశారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలోనూ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని కూడా వేగంగా అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

నంబర్ 3లో కోహ్లీ స్పెషల్

ఎంఎస్ ధోనీని కూడా సిద్ధూ ప్రశంసించారు. ధోనీ సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడని చెప్పారు. అయితే కోహ్లీ మాత్రం నంబర్ 3 స్థానంలో నిరంతరం బ్యాటింగ్ చేస్తూ భారీ పరుగులు సాధించాడని వివరించారు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని, ఆ స్థానంలో నిలకడగా పరుగులు సాధించడమే కోహ్లీ ప్రత్యేకత అని సిద్ధూ అభిప్రాయపడ్డారు. ఫిట్‌నెస్ విషయంలోనూ కోహ్లీ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు.

ఇది కూడా చదవండి: Virat Kohli: సచిన్, ధోనీ కాదు.. కింగ్ కోహ్లీ దృష్టిలో బెస్ట్ వన్డే బ్యాటర్ ఎవరంటే?

సచిన్‌తో కోహ్లీ పోలిక ఇదే

వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది. సచిన్ 18,426 వన్డే పరుగులు సాధించాడు. అయితే వేగంగా పరుగులు సాధించే విషయంలో కోహ్లీ ముందున్నాడని సిద్ధూ పేర్కొన్నారు. సచిన్ 377 ఇన్నింగ్స్‌ల్లో 15 వేల వన్డే పరుగులు పూర్తి చేయగా, కోహ్లీ 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో కోహ్లీ బ్యాటింగ్ వేగం, నిలకడపై మరోసారి చర్చ మొదలైంది.

ధోనీకి కెప్టెన్‌గా ప్రత్యేక స్థానం

ధోనీని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా సిద్ధూ గుర్తించారు. అతడి నాయకత్వంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. అయితే వన్డే బ్యాటింగ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మాత్రం కోహ్లీనే తన నంబర్ వన్ ఎంపిక అని సిద్ధూ స్పష్టం చేశారు. సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది సచిన్, ధోనీ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, కోహ్లీ అభిమానులు మాత్రం సిద్ధూ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. సచిన్, ధోనీ, కోహ్లీ ముగ్గురూ తమ తమ కాలాల్లో భారత క్రికెట్‌కు అందించిన సేవలు ప్రత్యేకమైనవే. అయితే వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడి విషయంలో సిద్ధూ మాత్రం కోహ్లీకి తన ఓటు వేశారు.

ఇది కూడా చదవండి:Virat Kohli: వెస్టిండీస్‌పై సిక్సర్ల వర్షం.. తన రికార్డును తానే బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us