WTC Final: ఇలా అయితే ఎలా..! బ్యాటింగ్ శైలి మార్చుకోవాలని సూచించిన క్రికెటర్ దిగ్గజం కపిల్ దేవ్
Kapil Dev: దూకుడుగా ఆడటం.. ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలని అనుకోవడం సహజం... అయితే, కొంత మెలుకువలతో ఆడితేనే మంచిది అంటూ టీమిండియా..

దూకుడుగా ఆడటం.. ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలని అనుకోవడం సహజం… అయితే, కొంత మెలుకువలతో ఆడితేనే మంచిది అంటూ టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచించాడు. టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ బ్యాటింగ్ శైలికి ఇంగ్లండ్ పిచ్‌లు అనుకూలించవని, అందువల్ల అతడు దూకుడు తగ్గించి ఆడాలని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సూచించాడు. గతంలో రోహిత్ శర్మకు కూడా ఇదే సలహాను ఇచ్చానని తెలిపాడు. దానిని పాటించి రోహిత్ సక్సెస్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. రిషభ్ కూడా దానినే పాటించి విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.
పంత్ సహజ సిద్ధమైన ఆటతీరుకి ఇంగ్లండ్‌లో పరిస్థితులు అనుకూలించకపోవచ్చని… అక్కడి పిచ్‌లపై ప్రతి బంతిని బాదాలని ప్రయత్నించకూడదని హితవు పలికాడు. క్రీజులో ఎక్కువ సేపు నిలిస్తే పరుగులు వాటంతట అవే వస్తాయి. గతంలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మకు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ఇప్పుడు రోహిత్ దానిని పాటించి విజయవంతమయ్యాడు. రోహిత్ లాగే పంత్ కూడా చాలా తెలివైన, విలువైన ఆటగాడు. తాను చెప్పిన ఫార్ములాను ఇంగ్లండ్ గడ్డపై పంత్ అమలు చేస్తాడనుకుంటున్నాను అని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
