Richest Cricketer: దేశంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా? మీరనుకుంటున్న ఆ ఇద్దరైతే కాదు..!
Richest Cricketer: క్రీడా రంగాల్లో అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్న వారు.. క్రీడల పరంగానే కాకుండా.. అనేక ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారనే...

Richest Cricketer: క్రీడా రంగాల్లో అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్న వారు.. క్రీడల పరంగానే కాకుండా.. అనేక ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారనే విషయం తెలిసిందే. క్రీడల్లో పాల్గొంటూ డబ్బు సంపాదించడంతో పాటు.. అవి లేనప్పుడు వివిధ వాణిజ్య కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రమోషన్స్ చేస్తూ ఒప్పందాలు చేసుకుంటారు. తద్వారా అత్యధిక మనీ సంపాదిస్తుంటారు. ఇలా మనీ సంపాదించే వారిలో క్రికెట్ ప్లేయర్లు ప్రధానం అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్లేయర్లకు ఉండే క్రేజీయే వేరు. ఆ క్రేజీయే వారికి డబ్బు భారీగా సంపాదించి పెడుతోంది.
మనదేశంలో క్రికెట్ ప్లేయర్లు భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. ప్రజల్లో వారికున్న పాపులారీటీని వారు క్యాష్ చేసుకుంటున్నారు. ఓ వైపు క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటూ బీసీసీఐ ద్వారా జీతం పొందడమే కాకుండా.. అనేక వ్యాపార కంపెనీల బ్రాండ్లకు ప్రచారం చేస్తూ మరో మార్గంలోనూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న క్రేజ్ ప్రకారం భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరు అంటే చాలా మంది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేదా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ అని టక్కున చెప్తారు. ఒకవేళ మీ ఆన్సర్ కూడా అదే అయితే పప్పులో కాలేసినట్లే అవుతుంది. అవును.. భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. అప్పటికీ, ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గని టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. భారత్‌లో టాప్ 5 ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. మరి ఆ టాప్ 5 రిచెస్ట్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..
సచిన్ టెండూల్కర్.. భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్‌గా నిలిచారు. సచిన్ మొత్తం ఆస్తుల విలువ రూ. 1090కోట్లు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ.. పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, కంపెనీల ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. తద్వారా సచిన్ భారత క్రికెటర్లందరిలోనూ అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

మహేంద్ర సింగ్ ధోనీ మిస్టర్ కూల్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ.. రూ. 767 కోట్ల విలువైన ఆస్తులతో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన క్రికెటర్‌గా నిలిచాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ధోనీకి క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం చాలానే ఉంది. యాడ్స్ రూపంలో, బ్రాండ్ అంబాసిడర్‌గా, ఇతర వ్యాపార మార్గాల ద్వారా ధోనీకి ఆదాయం వస్తోంది.
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ.638 కోట్లతో ప్రపంచంలోనే మూడో ధనవంతుడైన క్రికెటర్‌గా ఉన్నాడు. కోహ్లీకి బీసీసీఐ నుంచే కాకుండా వివిధ మార్గాల ద్వారా ఆదాయం లభిస్తోంది. కోహ్లీకి సొంత ఫ్యాషన్ బ్రాండ్ రాన్, ప్యూమాతో భాగస్వామ్యం ఉంది. అలాగే.. 20కి పైగా బ్రాండ్లకు విరాట్ ప్రచార కర్తగా ఉన్నాడు. ఇక ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లీ కెప్టె్న్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టు యాజమాన్యం నుంచి కోహ్లీకి ఏడాదికి రూ. 17 కోట్ల ఆదాయం లభిస్తోంది.
వీరేంద్ర సెహ్వాగ్ ఇక నాలుగో సంపన్న క్రికెటర్ స్థానంలో భారత మాజీ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేహ్వాగ్ నిలిచారు. వీరూ ఆస్తుల విలువ దాదాపు రూ. 277 కోట్లు ఉంది. వీరేంద్ర సేహ్వాగ్ ప్రస్తుతం ఎలాంటి క్రికెట్ టోర్నమెంట్‌లలో ఆడకపోయినప్పటికీ.. వివిధ వ్యాపార ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా డబ్బు ఆర్జిస్తున్నారు.
యువరాజ్ సింగ్ టీమ్‌ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు. యువరాజ్ ఆస్తుల విలువ దాదాపు రూ. 245 కోట్లు ఉంటుంది. యువరాజ్ సింగ్ ప్రస్తుతం పలు దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లలో ఆడుతున్నాడు. అలాగే పలు వ్యాపార ప్రకటనల్లోనూ పాల్గొంటున్నాడు.
Also read:
