Viral: విమానంలో భార్యాభర్తల ముద్దులాట.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!

తమను తాము మైమరిచిపోయిన ఓ జంట విమానంలో చేసిన పాడుపని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాము ఫ్లైట్‌లో..

Viral: విమానంలో భార్యాభర్తల ముద్దులాట.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 27, 2021 | 5:28 PM

Viral Video Telugu: తమను తాము మైమరిచిపోయిన ఓ జంట విమానంలో చేసిన పాడుపని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాము ఫ్లైట్‌లో ఉన్నామన్న విషయాన్ని ఆ జంట మర్చిపోయారు. ముద్దులతో మునిగిపోయారు. అయితే వారి వ్యవహారం నచ్చని తోటి పాసెంజర్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో మే 20వ తేదీన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కరాచీ-ఇస్లామాబాద్‌కు వెళ్లే ఫ్లైట్‌లో ఓ జంట ఎక్కారు. ఇక ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఆ జంట ముద్దుల మోత మోగించారు. వారు చేస్తున్న పనులకు వెనుక కూర్చున్న వ్యక్తి ఇబ్బందిగా ఫీల్ అయి ఎయిర్ హోస్టెస్‌కు కంప్లైంట్ చేశాడు. ”మీ చర్యలకు మిగతా వాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. ఇలాంటివి చేయకూడదని” ఆమె వారి దగ్గరకు వెళ్లి చెబుతుంది. అయినా ఆమె మాటలు పట్టించుకోని ఆ జంట యధావిధిగా తమ పనిలో మునిగిపోయారు. దీనితో చేసేది ఏమిలేక ఆ ఎయిర్ హోస్టెస్ వారికి బ్లాంకెట్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

ఈ విమానంలో బిలాల్ అనే ఓ లాయర్ కూడా ప్రయాణించాడు. అతడి ఆ జంట చేసే పనిని కొత్త కోణంలో చూశాడు. ముద్దులతో ఆ జంట రెచ్చిపోతుంటే.. ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరించిన విమాన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సివిల్ ఏవియేషన్ ఆధారిటీకి కంప్లైంట్ చేశాడు. దీనితో రంగంలోకి దిగిన సీఏఏ.. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని విమాన సిబ్బందిని మందలించింది. అయితే ఈ విషయం అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోతున్నారు.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!

బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..