WPL 2024, UPW vs GGW: తొలి విజయం కోసం గుజరాత్.. రెండో గెలుపు కోసం యూపీ వారియర్స్.. హోరాహోరీ మ్యాచ్‌కు సిద్ధమైన ఇరుజట్లు..
UP Warriorz vs Gujarat Giants: రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ గణాంకాలను పరిశీలిస్తే, యూపీ వారియర్స్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. గత సీజన్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ యూపీ వారియర్స్ జట్టే విజయం సాధించింది. కాగా, WPL 2023 మూడో మ్యాచ్‌లో యూవీ వారియర్స్ (UPW) 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ (GGW)ని ఓడించింది. గత సీజన్‌లో 17వ మ్యాచ్‌లో ఇరు జట్లు మరోసారి హోరాహోరీగా తలపడ్డాయి. ఈసారి UPW 3 వికెట్ల తేడాతో GGWని ఓడించింది.

WPL 2024, UP Warriorz vs Gujarat Giants: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 8వ మ్యాచ్‌లో, యూపీ వారియర్స్ (UPW) శుక్రవారం గుజరాత్ జెయింట్స్ (GGW)తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లీగ్‌లో ఇప్పటివరకు గుజరాత్ జెయింట్స్ (GGW) ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.
ఇటువంటి పరిస్థితిలో, బెత్ మూనీ తన జట్టుకు మొదటి విజయం సాధించడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు యూపీ వారియర్స్ తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో, అలిస్సా హీలీ తన రెండవ వరుస విజయంపై కన్నేసింది.
యూపీ వారియర్స్‌దే పైచేయి..
రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ గణాంకాలను పరిశీలిస్తే, యూపీ వారియర్స్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. గత సీజన్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ యూపీ వారియర్స్ జట్టే విజయం సాధించింది. కాగా, WPL 2023 మూడో మ్యాచ్‌లో యూవీ వారియర్స్ (UPW) 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ (GGW)ని ఓడించింది. గత సీజన్‌లో 17వ మ్యాచ్‌లో ఇరు జట్లు మరోసారి హోరాహోరీగా తలపడ్డాయి. ఈసారి UPW 3 వికెట్ల తేడాతో GGWని ఓడించింది.
రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
యూపీ వారియర్స్: అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), వృందా దినేష్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, పూనమ్ ఖేమ్నార్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వానిద్.
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (కెప్టెన్, కీపర్), వేద కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డేలాన్ హేమ్లత, ఆష్లే గార్డనర్, కేథరిన్ బ్రైస్, స్నేహ రాణా, తనూజా కన్వర్, లీ తహుహు, మేఘనా సింగ్.
ఇరుజట్ల స్వ్కాడ్స్..
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (కెప్టెన్, వికెట్ కీపర్), వేద కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డేలాన్ హేమ్లత, ఆష్లే గార్డనర్, కేథరిన్ బ్రైస్, స్నేహ రాణా, తనూజా కన్వర్, లీ తహూ, మేఘనా సింగ్, లారా వోల్వార్డ్, తరన్‌వార్డ్, ., మన్నత్ కశ్యప్, షబ్నమ్ ఎండీ షకీల్, సయాలీ సత్ఘరే, ప్రియా మిశ్రా, త్రిష పూజిత.
యూపీ వారియర్స్: అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), వృందా దినేష్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, పూనమ్ ఖేమ్నార్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, లక్ష్మీ థావ్, లక్ష్మీ థావ్, లక్ష్మీ థావ్ సొప్పదండి యశశ్రీ, చమరి అతపత్తు, డేనియల్ వ్యాట్, గౌహర్ సుల్తానా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
