WPL 2024, DCW vs MIW: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. తిరిగొచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ప్లేయింగ్ 11లో మార్పులు..
Delhi Capitals Women vs Mumbai Indians Women, 12th Match: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MIW) నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DCW)తో తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

WPL 2024, DCW vs MIW: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MIW) నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DCW)తో తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తిరిగి రావడం ముంబైకి శుభవార్త. గాయం కారణంగా హర్మన్ చివరి 2 మ్యాచ్‌లు ఆడలేదు. WPL 2024లో, ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి తలో 3 మ్యాచ్‌లు గెలిచాయి. అలాగే, ఇరుజట్లు తలో ఓటమిని ఎదుర్కొన్నాయి. ఇది కాకుండా, తమ సొంత మైదానంలో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ రోజు తమ మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునే మంచి అవకాశం ఉంది.
ముంబైదే పైచేయి..
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 4 సార్లు తలపడ్డాయి. వీటిలో ముంబై ఇండియన్స్ (MIW) 3 సార్లు, ఢిల్లీ క్యాపిటల్స్ (DCW) ఒకసారి గెలిచింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో MIWతో DCW తలపడింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది కాకుండా, WPL 2023 లో రెండు జట్లు 3 సార్లు ఢీకొన్నాయి. ఇందులో ముంబై రెండుసార్లు విజయం సాధించింది. WPL 2023 7వ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. WPL 2023 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. WPL 2023 ఫైనల్లో, ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
🚨 Toss Update 🚨
Mumbai Indians elect to bowl against Delhi Capitals at the Arun Jaitley Stadium.
Live 💻📱https://t.co/NlmvrPq6yj#TATAWPL | #DCvMI pic.twitter.com/Wh58esY5Zs
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2024
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత, జట్టు అద్భుతమైన పునరాగమనం చేసి తదుపరి మూడు మ్యాచ్‌లను గెలుచుకుంది. యూపీ వారియర్స్‌పై ఢిల్లీ 9 వికెట్ల తేడాతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 25 పరుగుల తేడాతో, గుజరాత్ జెయింట్స్‌పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
WPL 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన..
గత సీజన్ విజేత ముంబై ఇండియన్స్ కూడా ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తమ మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. చివరి మ్యాచ్‌లో MIW 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








