WPL 2023: బ్యాట్‌పై ధోని పేరుతో బరిలోకి.. ధనాధన్ ఇన్నింగ్స్ తొలి హాఫ్ సెంచరీ.. హాట్ టాపిక్‌గా మారిన టీమిండియా ప్లేయర్..
Kiran Navgire: UP వారియర్స్ మరియు గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది, ఇందులో UP జట్టు ఒక బంతి మాత్రమే మిగిలి ఉండగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2023 సీజన్‌లో మూడో మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఇందులో యూపీ వారియర్స్ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని 1 బంతి మిగిలి ఉండగానే విజయవంతంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో అభిమానులందరి దృష్టిని ఆకర్షించిన ఓ ప్లేయర్.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. UP జట్టు ప్లేయర్ కిరణ్ నవ్‌గిరే బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఆమె బ్యాట్‌పై మహేంద్ర సింగ్ ధోని జెర్సీ నంబర్ MSD 07 కనిపించింది.
ఈ మ్యాచ్‌లో కిరణ్ నవ్‌గిరే బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఆ జట్టు 13 పరుగులకే 1 వికెట్ కోల్పోయింతి. ఆ తర్వాత 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగింది. ఇటువంటి పరిస్థితిలో, కిరణ్ ఒక ఎండ్ నుంచి పరుగుల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. కేవలం 43 బంతుల్లో 53 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. దీంతో యూపీ వారియర్స్ జట్టు తిరిగి మ్యాచ్‌లోకి వచ్చే అవకాశం లభించింది.
ఆ తర్వాత, గ్రేస్ హారిస్ అజేయ అర్ధ సెంచరీతో రాణించగా, సోఫీ ఎక్లెస్టోన్ కేవలం 12 బంతుల్లో 22 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించింది.
2011 సంవత్సరం నుంచి ధోనిని ఫాలో అవుతోన్న కిరణ్..
2011 సంవత్సరంలో భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోనీని అనుసరించడం ప్రారంభించానని కిరణ్ నవగిరే WPL సీజన్ ప్రారంభానికి ముందు చెప్పుకొచ్చింది. అదే సమయంలో మహిళల క్రికెట్‌పై నాకు అవగాహన లేదు. నేను అప్పటి వరకు క్రికెట్ ఆడే మగవాళ్లను మాత్రమే చూశాను. మా గ్రామంలోని అబ్బాయిలతో ఆడడం ప్రారంభించాను అంటూ తెలిపింది.
కిరణ్ నవగిరే (27) మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించింది. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో నాగాలాండ్ జట్టుకు ఆడుతుంది. కిరణ్ తండ్రి రైతు కాగా, తల్లి గృహిణి. ఇది కాకుండా కిరణ్‌కు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. కిరణ్ 2022 సంవత్సరంలో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఆమె 6 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..