టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ..?
రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా 2023 ప్రపంచకప్ వరల్డ్‌కప్ 2019 టాప్ స్కోరర్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్, నిదాస్ ట్రోఫీ గెలిచిన భారత్ ముంబై: ప్రపంచకప్ 2019లో టీమిండియా జైత్రయాత్ర సెమీస్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. లీగ్ స్టేజి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ లో పేలవమైన ఆటతీరు కనబరిచి.. న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది. […]
- రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా 2023 ప్రపంచకప్
- వరల్డ్‌కప్ 2019 టాప్ స్కోరర్ రోహిత్ శర్మ
- రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్, నిదాస్ ట్రోఫీ గెలిచిన భారత్
ముంబై: ప్రపంచకప్ 2019లో టీమిండియా జైత్రయాత్ర సెమీస్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. లీగ్ స్టేజి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ లో పేలవమైన ఆటతీరు కనబరిచి.. న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది.
ఇక ఈ ఓటమితో టీమ్‌పై సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఒకవైపు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిని రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఫ్యాన్స్ అభ్యర్థిస్తుంటే.. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
సెమీస్ ఓటమి ప్రక్కన పెడితే.. రోహిత్ శర్మ ఇప్పటికీ కూడా టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 5 సెంచరీలు, 1 అర్ధ సెంచరీతో మొత్తం 648 పరుగులు చేశాడు. కానీ న్యూజిలాండ్‌తో సెమీస్ పోరులో మాత్రం అతడు ఒక్క పరుగుకే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అటు ఈ ఓటమి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ప్రభావం చూపడమే కాదు.. కోచ్ రవిశాస్త్రీ, కోహ్లీ మధ్య సఖ్యతలేమిని కూడా ఎత్తి చూపింది.
ఇది ఇలా ఉండగా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తన ట్విట్టర్ ద్వారా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2023 వరల్డ్‌కప్ ఆడాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అటు ఈ వైఫల్యం వల్ల వన్డే కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగిస్తే బాగుంటుందా.? అనే ప్రశ్నను కూడా అభిమానులను అడిగాడు.ఏది ఏమైనా అతడు చేసిన ప్రశ్నకు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Is it time to hand over white ball captaincy to Rohit Sharma? I would like him to lead India in 2023 World Cup?
— Wasim Jaffer (@WasimJaffer14) July 12, 2019
Yes This is the perfect time to give Rohit Sharma a white ball captaincy, at least T20Is considering the two T20 world cup in next two years.
— Judgment Day Failures (@IManish10_) July 13, 2019
Test captain- Virat And limited overs captain- rohit
— aj872 (@magical872reus) July 12, 2019
Completely agree sir… It’s the right time to appointment for new indian limited over captain.. Nd @ImRo45 sir is best option front of #Viratkohli.. He is suitable for replace him..
— It’s @Chandan (@chandan_264) July 13, 2019
Is it time to hand over white ball captaincy to Rohit Sharma? I would like him to lead India in 2023 World Cup?
— Wasim Jaffer (@WasimJaffer14) July 12, 2019
Completely Agree With You Sir ? Rohit Should Be Captain ✌️
— ROHIT SHARMA DIE HEART FANS (@DilipPhuyal45) July 13, 2019