Virat Kohli: ‘ఇది మా కింగ్ కోహ్లీ అంటే’.. అప్పుడు స్మిత్.. ఇప్పుడు నవీన్ ఉల్ హక్.. శత్రువులు సైతం మెచ్చుకునేలా..
మ్యాచ్ ప్రారంభం నుంచే మైదానంలో కోహ్లీ నినాదాలు వినిపించాయి.. మైదానంలో నవీన్ ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు విరాట్ పేరు మార్మోగిపోయింది. ఇక నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు దిగడంతో కోహ్లీ నినాదాలు మరింత మిన్నంటాయి. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత క్రీజులో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ తలపడ్డారు. నవీన్ బౌలింగ్‌లో కోహ్లీ మరీ దూకుడుగా ఆడలేదు. అలాగనీ నవీన్ ఉల్ హక్ కూడా కోహ్లిని ఇబ్బంది పెట్టలేకపోయాడు.
ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. కాగా విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ వివాదం కారణంగా ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా మ్యాచ్ ప్రారంభం నుంచే మైదానంలో కోహ్లీ నినాదాలు వినిపించాయి.. మైదానంలో నవీన్ ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు విరాట్ పేరు మార్మోగిపోయింది. ఇక నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు దిగడంతో కోహ్లీ నినాదాలు మరింత మిన్నంటాయి. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత క్రీజులో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ తలపడ్డారు. నవీన్ బౌలింగ్‌లో కోహ్లీ మరీ దూకుడుగా ఆడలేదు. అలాగనీ నవీన్ ఉల్ హక్ కూడా కోహ్లిని ఇబ్బంది పెట్టలేకపోయాడు. అయితే స్టేడియంలో కోహ్లీ పేరు మాత్రం మార్మోగిపోయింది. నవీన్‌ను లక్ష్యంగా చేసుకుని అభిమానులు కేకలు పెట్టారు. అయితే ఇక్కడే మరోసారి అందరి మనసులు గెల్చుకున్నాడు విరాట్. అభిమానుల వైపు చూస్తూ దయచేసి నవీన్‌ను గేలి చేయవద్దని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి తెగ మురిసిపోతున్నారు. ‘ఇది మా కింగ్ అంటే’.. ‘శత్రువులైనా మా ఆటగాడిని మెచ్చుకోవాల్సిందే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇది జరిగిన కొద్ది సేపటికే నవీన్, కోహ్లీ ఇద్దరూ కలిసి నవ్వుతూ పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. దీంతో గతంలో వీరి మధ్య వచ్చిన వైరానికి ఫుల్ స్టాప్ పెట్టారు.’ కోహ్లీ, నేను మ్యాచ్ మధ్యలో కరచాలనం చేసుకున్నాం. బయట కానీ.. మైదానంలో కానీ ఏం జరిగినా ఇంతటితో వదిలేద్దామని కోహ్లీతో చెప్పాను’ అని కోహ్లీతో జరిగిన సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు నవీన్ ఉల్ హక్.
దయచేసి అలా చేయవద్దు..
Virat Kohli asking the Delhi crowd to stop mocking Naveen Ul Haq He did it for Steve smith as well #ViratKohli𓃵 #rohit #INDvsAFG #naveen #gambhir pic.twitter.com/TBOxvY625x
— ICT Fan (@Delphy06) October 11, 2023
కాగా గతంలో స్మిత్ ను గేలిచేస్తూ భారత అభిమానులు నినాదాలు చేశారు. అప్పుడు కూడా ఫ్యాన్స్‌ను వారించాడు కోహ్లీ. దీంతో స్మిత్ సైతం కోహ్లీకి థ్యాంక్స్ చెప్పి హ్యాండ్ షేక్ ఇచ్చాడు.
With India fans giving Steve Smith a tough time fielding in the deep, @imVkohli suggested they applaud the Australian instead.
Absolute class 👏 #SpiritOfCricket #ViratKohli pic.twitter.com/mmkLoedxjr
— ICC (@ICC) June 9, 2019
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మత్ (80) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీతో అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 273 పరుగుల భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన ఛేదించిన టీమిండియాకు ఇషాన్ కిషన్ (47), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ (131) భారీ సెంచరీతో మెరిశాడు. మూడో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లీ అజేయంగా 55 పరుగులు చేశాడు. ఫలితంగా లక్ష్యాన్ని టీమిండియా 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..