World Cup 2023: అఫ్గాన్‌పై గ్రాండ్ విక్టరీ.. నెట్ రన్ రేట్‌లో పాక్‌ను అధిగమించిన భారత్.. పాయింట్ల పట్టిక
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన రెండో ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 15 ఓవర్లు మిగిలి ఉండగానే అఫ్గాన్ జట్టును ఓడించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టిన భారత్ పాయింట్ల పట్టికలో..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన రెండో ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 15 ఓవర్లు మిగిలి ఉండగానే అఫ్గాన్ జట్టును ఓడించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టిన భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయంతో భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. నెట్ రన్ రేట్ కూడా గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతం టీమిండియా రన్ రేట్ +1.500గా ఉంది. కాగా గత ప్రపంచకప్ ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌లపై సులభమైన విజయాలతో ఆ జట్టు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రస్తుతం న్యూజిలాండ్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. కానీ మంచి నెట్ రన్ రేట్ తో భారత్ కంటే ముందుంది. ప్రస్తుతం కివీస్ నెట్ రన్ రేట్ 1.958గా ఉంది. కాగా పాకిస్తాన్ ఖాతాలో కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. 0.927 నెట్ రన్ రేట్‌తో ప్రస్తుతం ఆ జట్టు మూడవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు కూడా ఆడిన ఏకైక మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో 2 పాయింట్లతో పాటు భారీ నెట్ రన్ రేట్ కూడాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 2.040 నెట్ రన్ రేట్‌తో జాబితాలో 4వ స్థానంలో ఉంది సౌతాఫ్రికా.
ఇక ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది ఆ జట్టు నెట్ రన్ రేట్ -0.653గా ఉంది. ఇక టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని ఆస్ట్రేలియా, శ్రీలంక, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 7, 8, 9, 10వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ ఆస్ట్రేలియా, దక్షిణా ఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో పాయింట్ల పట్టికలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో భారత్..
Updated Points Table 🏏#ICCCricketWorldCup23 #PointsTable pic.twitter.com/fWZtDIwqM2
— CRICKET JUNOON ®️ (@Cricktjunoon) October 11, 2023
ఇవాళ ఆసీస్, సౌతాఫ్రికాల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్..
Australia looks to bounce back against an in-form South Africa 👊
Who’s taking home the points in Lucknow?#AUSvSA | #CWC23 pic.twitter.com/W6Lps1QQF8
— ICC Cricket World Cup (@cricketworldcup) October 12, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..