World Cup 2023: ‘శత్రువునైనా ప్రేమిస్తాం’.. హైదరాబాద్ ఆతిథ్యానికి పాక్ ప్లేయర్స్ ఫిదా.. స్టాఫ్‌కు కానుకలు
దాయాది జట్టు భాగ్య నగరంలో అడుగుపెట్టిన క్షణం నుంచి వారికి మంచి ఆతిథ్యం లభించింది. మొదట హైదరాబాద్ విమనాశ్రయంలో పాక్ క్రికెటర్లకు సాదర స్వాగతం దొరికింది. ఇక బస చేసిన హోటల్‌లో అయితే పాక్ క్రికెటర్లను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు సిబ్బంది. ఇక మ్యాచుల సమయంలోనూ పాక్ జట్టుకు మద్దతుగా నిలిచారు హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్. ముఖ్యంగా శ్రీలంకతో మ్యాచ్ సమయంలో..
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం సుమారు ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ప్రాక్టీస్ మ్యాచ్‌లతో పాటు వరల్డ్ కప్ మొదటి రెండు మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలోనే ఉండడంతో సుమారు రెండు వారాలుగా హైదరాబాద్‌లోనే బస చేసింది. ఈ నేపథ్యంలో దాయాది జట్టు భాగ్య నగరంలో అడుగుపెట్టిన క్షణం నుంచి వారికి మంచి ఆతిథ్యం లభించింది. మొదట హైదరాబాద్ విమనాశ్రయంలో పాక్ క్రికెటర్లకు సాదర స్వాగతం దొరికింది. ఇక బస చేసిన హోటల్‌లో అయితే పాక్ క్రికెటర్లను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు సిబ్బంది. ఇక మ్యాచుల సమయంలోనూ పాక్ జట్టుకు మద్దతుగా నిలిచారు హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్. ముఖ్యంగా శ్రీలంకతో మ్యాచ్ సమయంలో చాలామంది అభిమానులు ‘పాక్ జీతేగా’ అని నినాదాలు చేశారు. ఇలా అడుగడుగునా తమపై ప్రేమను కురిపిస్తూ, కేరింగ్ చూపించిన హైదరాబాదీయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పాక్ క్రికెటర్లు.ఈక్రమంలో శ్రీలంకతో మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్‌కు బయలు దేరేముందు ఉప్పల్ స్టేడియం సిబ్బందితో సరదాగా ముచ్చటించారు పాక్ ప్లేయర్స్. కెప్టెన్ బాబర్ ఆజంతో సహా కొందరు క్రికెటర్లు ఉప్పల్ గ్రౌండ్ స్టాఫ్‌కు తమ జెర్సీలను కానుకగా ఇచ్చారు. అలాగే స్టాఫ్‌తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు కూడా దిగారు. దీంతో ఉప్పల్ గ్రౌండ్ స్టాఫ్, హోటల్ సిబ్బంది ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
కాగా హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశారు పాక్ క్రికెటర్లు. ఇక్కడి రెస్టారెంట్లలో హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ, ఇతర వంటకాలను ఆరగిస్తూ ఆస్వాదించారు. ఫ్యాన్స్‌తో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ‘ హైదరాబాద్ ఆతిథ్యం.. మీరందరూ చూసే ఉంటారు. మేం విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఎవరో ఫొటోలు తీశారు. రావల్పిండిలో జనం ముందు ఆడుకుంటున్నట్లు అనిపించింది. లాహోర్‌లోని మా మైదానం పెద్దది, చాలా మంది అక్కడికి వస్తారు, కానీ ఈ రోజు రావల్పిండిలో పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది’ అని పాక్ వికెట్ కీపర్ అండ్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ హైదరాబాద్ ఆతిథ్యంపై ప్రశంసలు కురిపించారు. కాగా నెదర్లాండ్స్, శ్రీలంక జట్లపై ఘన విజయం సాధించిన పాక్ క్రికెట్ జట్టు శనివారం (అక్టోబర్ 14) ఆతిథ్య భారత్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఉప్పల్ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ కు జెర్సీ బహూకరణ
Babar Azam gifted his jersey to the Hyderabad groundstaff. pic.twitter.com/CKPlYxIBSa
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2023
రెస్టారెంట్ లో సందడి చేసిన దాయాది క్రికెటర్లు..
🎥 Hangout in Hyderabad: Glimpses from the Pakistan team dinner 🍽️#CWC23 pic.twitter.com/R2mB9rQurN
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..