IND vs AFG Match Report: రోహిత్ తుఫాన్ సెంచరీ.. లోకల్ బాయ్ హాఫ్ సెంచరీ.. ఆఫ్గాన్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం..
ICC World Cup Match Report, India vs Afghanistan: 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. అలాగే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సహాయంతో భారత్ ఆఫ్గానిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఘనమైన విజయంతో అసలు పోరుకు సిద్ధమైంది.

India vs Afghanistan, 9th Match: భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన తుఫాను సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టి 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. భారత కెప్టెన్ ఇన్నింగ్స్ 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధికంగా 7 సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అఫ్గానిస్థాన్ తరపున రషీద్ ఖాన్ అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు.
రోహిత్ ఇషాన్ శుభారంభం..
273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. దీంతో భారత్ 11.5 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు 156 (112) పరుగులు జోడించారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసి, ఫిదా కాని వారు లేరు. ఆఫ్ఘన్ బౌలర్లు రోహిత్ ముందు పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు. ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సృష్టించడం ద్వారా రోహిత్ వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్‌ను అధిగమించాడు.
కాగా, 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 (47) పరుగులు ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 18.4 ఓవర్లలో 156 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్థాన్‌కు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత 26 ఓవర్లలో రషీద్ ఖాన్ రోహిత్ శర్మను అవుట్ చేశాడు. భారత కెప్టెన్‌ను రషీద్ బౌల్డ్ చేశాడు.
కోహ్లి హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్..
View this post on Instagram
విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ జోడీ జట్టును విజయపథంలోకి చేర్చింది. మూడో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి 55* పరుగులు చేయగా, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యర్ 25* పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు ఉండగా, అయ్యర్ ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 1 సిక్స్ ఉన్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు ఫర్వాలేదనిపించగా..
అఫ్గానిస్థాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ మాత్రమే 2 వికెట్లు తీశాడు. ఈ సమయంలో రషీద్ 8 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చాడు. మిగతా బౌలర్లందరూ తేలిపోయారు. అజ్మతుల్లా ఉమర్జాయ్ జట్టుకు అత్యంత ఖరీదైన బౌలర్‌గా మారాడు. అతను 8.50 ఎకానమీ వద్ద 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..