NZ Vs AFG: చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకున్న అఫ్గాన్.. కివీస్ చేతిలో చిత్తు.. టాప్‌కు చేరిన న్యూజిలాండ్
గత మ్యాచ్‌లో లాగే ఈ మ్యాచ్‌లోనూ అఫ్ఘాన్ బౌలర్లు విజృంభించారు. ఒక పరుగు తేడాలో 3 వికెట్లు పడగొట్టి కివీస్ కు షాక్ ఇచ్చింది ఆఫ్గాన్. దీంతో న్యూజిలాండ్ ఒకానొక దశలో 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే దీని తర్వాత పట్టు కోల్పోయింది అఫ్గాన్. పేలవమైన ఫీల్డింగ్‌తో వికెట్లు తీసే అవకాశాలను కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు 4 క్యాచ్‌లు, 1 స్టంపింగ్ అవకాశాన్ని వదులుకుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది.
డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి వన్డే ప్రపంచకప్-2023లో పెను సంచలనం సృష్టించింది అఫ్గానిస్తాన్. ఇవాళ (అక్టోబర్ 18) గత ఫైనలిస్టు న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతోంది. కాగా గత మ్యాచ్‌లో లాగే ఈ మ్యాచ్‌లోనూ అఫ్ఘాన్ బౌలర్లు విజృంభించారు. ఒక పరుగు తేడాలో 3 వికెట్లు పడగొట్టి కివీస్ కు షాక్ ఇచ్చింది ఆఫ్గాన్. దీంతో న్యూజిలాండ్ ఒకానొక దశలో 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే దీని తర్వాత పట్టు కోల్పోయింది అఫ్గాన్. పేలవమైన ఫీల్డింగ్‌తో వికెట్లు తీసే అవకాశాలను కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు 4 క్యాచ్‌లు, 1 స్టంపింగ్ అవకాశాన్ని వదులుకుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 288 పరుగులు చేసింది. ఫిలిప్స్ 71 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టు ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. వరుసగా వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు, పేసర్లు విజృంభించడంతో అఫ్గాన్ జట్టు . 34.4 ఓవర్లలో 139 రన్స్ కు ఆలౌటై 149 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో ఆడ లేదు. దీంతో టామ్ లాథమ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన కివీస్‌కు ముజీబ్ ఉర్ రెహమాన్ తొలి దెబ్బ కొట్టాడు. ఏడో ఓవర్ మూడో బంతికి కాన్వేను ఎల్‌బీడబ్ల్యూ గా ఔట్ చేశాడు. 21వ ఓవర్లో అజ్మతుల్లా రచిన్ రవీంద్ర వికెట్ పడగొట్టాడు. అయితే విల్ యంగ్ అద్భుత అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అయితే మధ్యలో ఆఫ్గాన్ స్పిన్నర్లు విజృంభించారు. ఒక పరుగు తేడాలో 3 వికెట్లు పడగొట్టారు. దీంతో న్యూజిలాండ్ ఒకానొక దశలో 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే చెత్త ఫీల్డింగ్ ఆఫ్గాన్ జట్టును కొంపముంచింది. వికెట్లు తీసే అవకాశమున్నా పట్టు సడలించారు. క్యాచ్‌లు జారవిడిచారు. దీంతో కివీస్ మళ్లీ పుంజుకుంది. ఆఫ్గనిస్తాన్‌కు భారీ టార్గెట్ విధించింది. దీనిని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్గాన్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కివీస్ స్పిన్నర్లకు పూర్తిగా దాసోహమయ్యారు. రహమత్ (36), అజ్మతుల్లా (27) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వారు పూర్తిగా నిరాశ పర్చారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, ఫెర్గూసన్ చెరో 3 వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టీమిండియా రెండో ప్లేస్‌కు పడిపోయింది.
శాంట్నర్ సూపర్బ్ బౌలింగ్..
View this post on Instagram
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..