IND vs BAN: గేమ్ ఛేంజర్స్.. ఈ ఐదుగురు బంగ్లా ఆటగాళ్లు వెరీ డేంజరస్.. క్షణాల్లో మ్యాచ్‌ను మార్చేస్తారు..
వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది . ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇది నాలుగో మ్యాచ్. సెమీఫైనల్‌కు చేరుకోవడం సులభతరం చేసేందుకు భారత్ రంగంలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2 పాయింట్లు జోడించడంతోపాటు నెట్ రన్ రేట్ కూడా పెరుగుతుంది. అయితే, భారతదేశం అనుకున్నంత సులభం కాదు. ముఖ్యంగా గత చరిత్రను చూసుకుని బరిలోకి దిగాలి
వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది . ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇది నాలుగో మ్యాచ్. సెమీఫైనల్‌కు చేరుకోవడం సులభతరం చేసేందుకు భారత్ రంగంలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2 పాయింట్లు జోడించడంతోపాటు నెట్ రన్ రేట్ కూడా పెరుగుతుంది. అయితే, భారతదేశం అనుకున్నంత సులభం కాదు. అందుకే గత చరిత్రను చూసుకుని బరిలోకి దిగాలి. 2007 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు మిగిల్చిన చేదు అనుభవాన్ని ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి బంగ్లా టైగర్లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని కొందరు ఆటగాళ్లకు ఏకంగా మ్యాచ్‌ని మార్చే సత్తా ఉన్నవారే. ఆ ఐదుగురు స్లార్ ప్లేయర్ల ఎవరో తెలుసకుందాం రండి.
ముస్తాఫిజుర్ రెహమాన్
ముస్తాఫిజుల్ రెహమాన్ ఫాస్ట్ బౌలర్. టీమ్ ఇండియాపై ముస్తాఫిజుర్ 3 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో అప్రమత్తంగా ఆడాల్సి ఉంటుంది.
షకీబ్ అల్ హసన్
షకీబ్ అల్ హసన్ ప్రపంచ నంబర్ 1 ఆల్ రౌండర్. బంగ్లాదేశ్‌కు సారథిగా, ఆటగాడిగా ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లో షకీబ్ రాణించగలదు. పైగా సీనియర్ ప్లేయర్‌గా అతనికి గొప్ప అనుభవం ఉంది. కాబట్టి షకీబ్ పని పట్టేందుకు టీమిండియా ముందుగానే ప్లాన్స్ వేసుకోవాలి
నజ్ముల్ హుస్సేన్ శాంటో
బంగ్లాదేశ్ జట్టులో ఉన్న స్టార్ బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో ఒకరు. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైనా ధాటిగా ఆడగల సామర్థ్యం ఉంది. కాబట్టి భారత బౌలర్లు త్వరగా అతనిని ఔట్ చేయాలి.
మెహదీ హసన్ మిరాజ్
మెహదీ హసన్ మిరాజ్ స్పిన్ ఆల్ రౌండర్. బౌలర్‌గా, బ్యాటర్‌గా మెహదీ తక్కువ కాలంలోనే ఎన్నో ఘనతలను సాధించాడు. టీమిండియా బౌలర్లు, బ్యాటర్లు ఇతని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లిటన్ దాస్
బంగ్లాదేశ్‌కు స్టార్ ఓపెనర్ లిటన్ దాస్ ఇంగ్లండ్‌పై 76 పరుగులు చేశాడు. గతంలో టీమిండియాపై ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి లిటన్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తేనే మ్యాచ్‌పై పట్టు దొరుకుతుంది.
నెట్స్ లో శ్రమిస్తోన్న విరాట్ కోహ్లీ..
View this post on Instagram
రోహిత్ శర్మ బౌలింగ్ ప్రాక్టీస్..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..