IND vs BAN: భారత్‌ను ఓడిస్తే డేట్‌కు వస్తా.. బంగ్లాకు పాక్ నటి బంపరాఫర్.. బుద్ధి చూపించుకుందిగా..
భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో పాక్ క్రికెట్ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పాక్ ప్లేయర్లపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇక భారత్ విజయాన్ని జీర్ణించుకోలేక పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్, పీసీబీ కూడా బీసీసీఐపై అనవసర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి సెహర్ షిన్వారి చేరింది.
ప్రపంచ కప్ లీగ్ రౌండ్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్తానానికి చేరుకుంది. మరోవైపు భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో పాక్ క్రికెట్ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పాక్ ప్లేయర్లపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇక భారత్ విజయాన్ని జీర్ణించుకోలేక పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్, పీసీబీ కూడా బీసీసీఐపై అనవసర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి సెహర్ షిన్వారి చేరింది. గురువారం (అక్టోబర్ 19) మ్యాచ్‌లో టీమిండియాను ఓడించాలంటూ బంగ్లా క్రికెటర్స్‌ను కోరింది. అంతేకాదు భారత్‌ను ఓడిస్తే బంగ్లా ప్లేయర్లతో కలిసి డేట్‌కు వెళతానంటూ బంపరాఫర్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సెహర్ షిన్వారి షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘ ఇన్షా అల్లాహ్.. భారత్ తో ఆడే మ్యాచులో మా బంగ్లా బంధువులు ప్రతీకారం తీర్చుకుంటారని ఆశిస్తున్నాను. బంగ్లాదేశ్ జట్టు, భారత్‌ని ఓడించగలిగితే నేను ఢాకాకి వెళ్తా. అక్కడ బెంగాలీ బాయ్‌తో ఫిష్ డిన్నర్ డేట్ చేస్తా’ అని ట్వీట్ చేసింది పాక్ నటి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్టుకు టీమిండియా ఫ్యాన్స్ కూడా అలాగే స్పందిస్తున్నారు. ‘మరోసారి మీ బుద్ధి చూపించుకన్నావుగా’.. ‘మీ వల్లే కాలేదు.. ఇంకా బంగ్లాతో అవుతుందా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు
కాగా గురువారం మధ్యాహ్నం భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. లీగ్ రౌండ్‌లో భారత్ 3 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల్లో 2 ఓటములు, ఒక విజయంతో ఏడో స్థానంలో ఉంది. కాగా వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌కు మంచి రికార్డే ఉంది. అయితే 2007 వన్డే ప్రపంచకప్‌లో మాత్రం భారత్‌పై బంగ్లా విజయం సాధించింది. ఈ ఓటమితో ఏకంగా ప్రపంచకప్ నుంచే నిష్ర్కమించింది టీమిండియా. ఇప్పుడదే పునరావృతం చేయాలని బంగ్లా భావిస్తోంది. అయితే టీమిండియ ఇప్పుడు చాలా పటిష్ఠంగా ఉంది. మనల్ని ఓడించాలంటే వారు బాగా శ్రమించాల్సిందే.
సెహర్ షిన్వారి సోషల్ మీడియా పోస్ట్..
InshAllah my Bangali Bandu will avenge us in the next match. I will go to dhaka and have a fish dinner date with Bangali boy if their team managed to beat India ✌️❤️ 🇧🇩
— Sehar Shinwari (@SeharShinwari) October 15, 2023
పాక్ నటి లేటెస్ట్ సోషల్ మీడియా ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..