AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: భారత్‌ వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌.. అహ్మదాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు.. రంగంలోకి ఎన్‌ఎస్‌జీ కమెండోలు

అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం సిద్ధమైంది. శనివారం జరిగే ఈ మ్యాచ్‌కు అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్​ రావడంతో మరింత అప్రమత్తమైన పోలీసులు.. మ్యాచ్​ జరిగే రోజున నగరాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోనున్నారు. 11 వేల మంది సిబ్బందితో భద్రతను పర్యవేక్షించనున్నారు.

IND vs PAK: భారత్‌ వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌.. అహ్మదాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు.. రంగంలోకి ఎన్‌ఎస్‌జీ కమెండోలు
India Vs Pakistan
Basha Shek
|

Updated on: Oct 11, 2023 | 11:21 AM

Share

అటు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టెన్షన్‌. ఇటు పోలీసుల అటెన్షన్‌. అహ్మదాబాద్‌లో జరగనున్న వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌కి 11 వేల మంది సిబ్బందితో భద్రత కల్పించనున్నారు. ఏకంగా NSG కమెండోలు రంగంలోకి దిగనున్నారు. క్రికెట్​ మహా సంగ్రామంలో దాయాదుల యుద్ధానికి సమయం దగ్గరపడుతోంది. వరల్డ్‌ కప్​ 2023లో భాగంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే భారత్​-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు గుజరాత్​.. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం సిద్ధమైంది. శనివారం జరిగే ఈ మ్యాచ్‌కు అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్​ రావడంతో మరింత అప్రమత్తమైన పోలీసులు.. మ్యాచ్​ జరిగే రోజున నగరాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోనున్నారు. 11 వేల మంది సిబ్బందితో భద్రతను పర్యవేక్షించనున్నారు. మ్యాచ్​ జరుగనున్న అహ్మదాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. స్థానిక పోలీసులు, హోమ్ గార్డులతోపాటు ఎన్ఎస్‌జీ కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఏడు వేల మంది పోలీసులతో పాటు మరో 4 వేల మంది హోంగార్డులను మోహరిస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. స్టేడియం పరిసరాల్లో.. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్‌ వెల్లడించారు.

కాగా భారత్‌ పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా మొత్తం 11 వేల మందికి పైగా భద్రతా సిబ్బందితో ఆ రోజు నగరం మొత్తం పోలీసులు ఆధీనంలోకి వెళ్లిపోనుంది. లక్ష మందికి పైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్ చూడడానికి వస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. టెర్రరిస్టులు దాడులు చేస్తే..వెంటనే NSG కమెండోలు రంగంలోకి దిగి వాళ్లను అడ్డుకోనున్నారు. ఇక SDRF, NDRF​ దళాలను కూడా మోహరిస్తున్నారు. అదనంగా 3 ‘హిట్​ టీమ్స్’, ఒక NSG ‘యాంటీ-డ్రోన్​ టీమ్’​, 9 ‘బాంబ్​ డిటెక్షన్&డిస్పోజల్​ స్క్వాడ్​’లను మోహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో టీమిండియా ప్రాక్టీస్..

స్టేడియం చుట్టూ గస్తీ..

రన్ రేట్ పై టీమిండియా దృష్టి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..