బలిదాన్‌ చిహ్నం లేకుండానే మ్యాచ్‌లో ధోని

ఓవల్: ప్రపంచకప్‌లో భాగంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ బలిదాన్‌ చిహ్నం ఉన్న గ్లోవ్స్‌ను వేసుకుని ఆడడం పలు రకాల వాదనలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఐసీసీ చివరకు.. వికెట్‌ కీపర్‌ గ్లోవ్స్‌ విషయంలోని ప్రామాణికాల ప్రకారం బలిదానం చిహ్నం సరైంది కాదని స్పష్టం చేయడంతో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆ చిహ్నం లేని గ్లోవ్స్‌ను వేసుకుని ఆడాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ బలిదాన్‌ చిహ్నం ఉన్న గ్లోవ్స్‌నే ధోనీ వాడతాడని, అయితే ఆ చిహ్నాలు కనిపించకుండా టేపు అతికించే అవకాశముందని ప్రచారం జరిగింది. కానీ, ధోనీ ఆ పనిచేయలేదు. కొత్త […]

బలిదాన్‌ చిహ్నం లేకుండానే మ్యాచ్‌లో ధోని
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 09, 2019 | 9:22 PM

ఓవల్: ప్రపంచకప్‌లో భాగంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ బలిదాన్‌ చిహ్నం ఉన్న గ్లోవ్స్‌ను వేసుకుని ఆడడం పలు రకాల వాదనలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఐసీసీ చివరకు.. వికెట్‌ కీపర్‌ గ్లోవ్స్‌ విషయంలోని ప్రామాణికాల ప్రకారం బలిదానం చిహ్నం సరైంది కాదని స్పష్టం చేయడంతో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆ చిహ్నం లేని గ్లోవ్స్‌ను వేసుకుని ఆడాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ బలిదాన్‌ చిహ్నం ఉన్న గ్లోవ్స్‌నే ధోనీ వాడతాడని, అయితే ఆ చిహ్నాలు కనిపించకుండా టేపు అతికించే అవకాశముందని ప్రచారం జరిగింది. కానీ, ధోనీ ఆ పనిచేయలేదు. కొత్త గ్లోవ్స్‌ను వాడాడు. ధోనీ ఆ గ్లోవ్స్‌ను ధరించేందుకు అనుమతించాలని బీసీసీఐ రాసిన లేఖని ఐసీసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనల ప్రకారం తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. ఆటగాళ్లు ధరించే దుస్తులపై లేదా పరికరాలపై స్పాన్సర్ల స్టిక్కర్లు తప్ప మిగతా సందేశాలు, లోగోలు ఉండరాదని తెలిపింది. దీంతో ధోనీ కొత్త గ్లోవ్స్‌తో మైదానంలోకి వచ్చారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్