Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్.. భారత్ మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తోనే ఎప్పుడంటే ?

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లాండ్‌లో జూన్ 12 నుండి జూలై 5 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో భారత్ తమ మొదటి మ్యాచ్‌ను జూన్ 14న పాకిస్తాన్‌తో ఆడనుంది. గ్రూపులు, కీలక మ్యాచ్‌ల వివరాలు తెలుసుకుందాం.

Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్.. భారత్ మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తోనే ఎప్పుడంటే ?
Womens T20 World Cup 2026
Lohith Kumar
|

Updated on: Jul 06, 2025 | 8:41 PM

Share

Womens T20 World Cup 2026 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 ఫుల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 12 నుండి జూలై 5 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. వీటి మధ్య 33 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ జూన్ 12న ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతుంది. ఇక భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను జూన్ 14న పాకిస్తాన్ తో ఆడనుంది.

వరల్డ్ కప్‌లో పాల్గొనే 12 దేశాలను ఆరు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. మిగిలిన రెండు జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్స్ ద్వారా గ్రూప్ Aలో చోటు సంపాదిస్తాయి. ఇక గ్రూప్ Bలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి. మిగిలిన రెండు జట్లు కూడా గ్లోబల్ క్వాలిఫైయర్స్ ద్వారానే నిర్ణయించనున్నారు. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లు జూన్ 30న, జూలై 2న ది ఓవల్ మైదానంలో జరుగుతాయి. ఇక ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్ మైదానంలో జరుగుతుంది.

World Cup 2026

World Cup 2026

భారత్ షెడ్యూల్ ఇదే

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో తమ ప్రస్థానాన్ని జూన్ 14న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది. భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను జూన్ 17న గ్లోబల్ క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే జట్టుతో ఆడుతుంది. దాని మూడో మ్యాచ్ జూన్ 21న దక్షిణాఫ్రికాతో, నాలుగో మ్యాచ్ జూన్ 24న గ్లోబల్ క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే రెండో జట్టుతో ఆడుతుంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్ చివరి మ్యాచ్ జూన్ 28న ఆస్ట్రేలియాతో ఉంటుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అక్కడ రివర్స్‌లో నీటి ప్రవాహం.. కాగితం పడవ వదిలి సంబరపడిన మంత్రి!
అక్కడ రివర్స్‌లో నీటి ప్రవాహం.. కాగితం పడవ వదిలి సంబరపడిన మంత్రి!
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం.. 13 మందికి అస్వస్థత..
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం.. 13 మందికి అస్వస్థత..
మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసిన కేటుగాడు!
మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసిన కేటుగాడు!
మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. ధర చూస్తే క్యూ కట్టేస్తారంతే..
మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. ధర చూస్తే క్యూ కట్టేస్తారంతే..
గుజరాత్‌లో కూలిన భారీ వంతెన.. నదిలో పడిపోయిన పలు వాహనాలు!
గుజరాత్‌లో కూలిన భారీ వంతెన.. నదిలో పడిపోయిన పలు వాహనాలు!
మరోసారి అతనితో కనిపించిన సామ్..
మరోసారి అతనితో కనిపించిన సామ్..
సెట్‌లో నటితో అసభ్య ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్
సెట్‌లో నటితో అసభ్య ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్
హైదరాబాద్‌ క్రైం కథ..! రూ.15 లక్షలతో హత్యా ఒప్పందం.. అడ్వాన్స్‌
హైదరాబాద్‌ క్రైం కథ..! రూ.15 లక్షలతో హత్యా ఒప్పందం.. అడ్వాన్స్‌
ముసలమ్మలా ఉందంటూ ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన విరుష్క ఫ్యాన్స్
ముసలమ్మలా ఉందంటూ ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన విరుష్క ఫ్యాన్స్
Video: బ్రెజిల్ పర్యటన ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధాని మోదీ...
Video: బ్రెజిల్ పర్యటన ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధాని మోదీ...