T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ సమరానికి సై.. టిక్కెట్ల అమ్మకాలు షురూ.. ధర తెలిస్తే షాకే..!
T20 World Cup 2024: ICC మహిళల T20 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. 5 జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్-బిలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. రెండు గ్రూపుల్లోని టాప్-2 జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
T20 World Cup 2024: అక్టోబర్ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్‌నకు యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది. నిజానికి ఈ టోర్నీ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. కానీ, బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస కారణంగా, ప్రపంచ కప్ బంగ్లాదేశ్ నుంచి UAEకి మార్చారు. ఈ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు దుబాయ్, షార్జా మైదానాల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ICC టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించింది.
115 రూపాయలకే టిక్కెట్లు..
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 టిక్కెట్ ధరలను చాలా తక్కువగా ఉంచడం గమనార్హం. స్టేడియంకు గరిష్టంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి ICC టిక్కెట్ ధరను కేవలం 5 దిర్హామ్‌ల వద్ద ఉంచింది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.115లు అన్నమాట. ఈ టికెట్‌ను ఐసీసీ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ICC టిక్కెట్ ధరలను విడుదల చేయడానికి ప్రపంచంలోనే ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాను ఎంపిక చేసింది. మహిళల T20 ప్రపంచ కప్ 2024 టిక్కెట్ ధరలను లేజర్ షో ద్వారా విడుదల చేశారు.
ఉచిత ప్రవేశం..
టికెట్ ధరను కేవలం రూ.115గా ఉంచడమే కాకుండా, టోర్నీని వీక్షించేందుకు వచ్చే 18 ఏళ్లలోపు వారికి కూడా ఐసీసీ ఉచిత టిక్కెట్లను అందిస్తోంది. అంటే, 18 ఏళ్లలోపు వారికి స్టేడియంలోకి ప్రవేశం ఉచితం ఉందన్నమాట. మ్యాచ్‌ని చూసేందుకు యువ క్రికెట్ అభిమానులను మరింతగా ఆకర్షించడమే ICC లక్ష్యం.
10 జట్ల మధ్య పోరు..
ICC మహిళల T20 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. 5 జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్-బిలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. రెండు గ్రూపుల్లోని టాప్-2 జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. అక్టోబరు 17, 18 తేదీల్లో షార్జా మైదానంలో సెమీఫైనల్స్, 20న దుబాయ్ మైదానంలో ఫైనల్ జరగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..